తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'విశ్వంభర' కోసం ఆ ఇద్దరు బ్యూటీలు - లిస్ట్ చాలా పెద్దదే! - చిరంజీవి విశ్వంభర మూవీ

Vishwambhara Cast : మెగాస్టార్ చిరంజీవి లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న 'విశ్వంభర'లో త్రిషతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలు మీ కోసం

Vishwambhara Cast
Vishwambhara Cast

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 9:04 AM IST

Updated : Feb 23, 2024, 9:57 AM IST

Vishwambhara Cast :మెగాస్టార్ చిరంజీవి లీడ్​ రోల్​లో డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర'. సోషియో ఫాంటసీగా రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ త్రిష నటిస్తుండగా, తాజాగా ఈ లిస్ట్​లోకి మరో ఇద్దరు హీరోయిన్లు కూడా చేరుకున్నారు. ఇషా చావ్లా, సురభి ఈ సినిమాలో అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు సమచారం. వీరిపై ఇప్పటికే కొన్ని సన్నివేశాలు తెరకెక్కించినట్టు తెలుస్తోంది. అయితే వీరందరితో పాటు మరికొందరు కథానాయికలూ కూడా ఈ సినిమాలో కనిపించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

మరోవైపు ఈ సినిమా కోసం జిమ్​లో చెమటోడుస్తున్నారు చిరు. మునుపటికంటచే మరింత ఫిట్‌గా కనిపించాలని ఆయన తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. ఫిట్​నెస్​ ట్రైనర్ సూచనల మేరకు వీలుచిక్కినప్పుడల్లా చెమటోడుస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది .దీంతో పాటు ఇటీవలే సెట్స్​లోకి త్రిష అడుగుపెట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే ఇటీవలే బ్రేక్​ తీసుకున్న చిరు తదుపరి షెడ్యుల్​ కోసం సెట్స్​లోకి రానున్నారట. ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ మొదలవుతుంది.

Chiranjeevi Socio Fantasy Movies : ఇక చిరు ఈ తరహా జానర్​ సినిమాల్లో నటించడం ఇదేం తొలిసారి కాదు. ఆయన ఇది వరకే 'జగదేక వీరుడు అతిలోక సుందరి','అంజి' లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు ఈ సినిమాతో తనను మరింత కొత్తగా చూపించేందుకు మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమాకు మ్యాజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, కాన్సెప్ట్ వీడియో కూడా ప్రేక్షకులను సినిమాపై మరిన్నీ అంచనాలు పెంచేసేంది. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై ఈ మూవీ తెరకెక్కుతోంది.

'విశ్వంభర' ప్రపంచంలోకి చిరు ఎంట్రీ - రిలీజ్ ఎప్పుడంటే ?

'విశ్వంభర' హీరోయిన్ అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ - 18 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్​

Last Updated : Feb 23, 2024, 9:57 AM IST

ABOUT THE AUTHOR

...view details