తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

గేమ్​ను మలుపు తిప్పిన హరితేజ - మెగా చీఫ్​గా విష్ణుప్రియ - ప్రైజ్​మనీ పెంచిన బిగ్​బాస్​!! - BIGG BOSS 8 MEGA CHIEF VISHNU PRIYA

- విష్ణుప్రియను చీఫ్​గా ఎంచుకున్న గౌతమ్​ - కన్నీళ్లు పెట్టుకున్న ప్రేరణ.. ఓదార్చిన పృథ్వీ

Bigg Boss 8 Mega Chief Vishnu Priya
Bigg Boss 8 Mega Chief Vishnu Priya (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2024, 10:50 AM IST

Bigg Boss 8 Mega Chief Vishnu Priya: బిగ్​బాస్​ హౌజ్​లో గత మూడు రోజులుగా జరిగిన బీబీ రాజ్యం టాస్కులు ముగిశాయి. ఈ టాస్కులు ముగిసే సమయానికి పృథ్వీ, రోహిణి, ప్రేరణ, నిఖిల్ మాత్రమే చీఫ్ కంటెండర్లుగా ఉన్నారు. అయితే మరో ఇద్దరికి కూడా మెగా చీఫ్ కంటెండర్లు అయ్యే ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. ఇరు క్లాన్లు చర్చించుకొని రెండు క్లాన్ల నుంచి చెరొక మెంబర్‌ని మెగా చీఫ్ కంటెండర్‌గా పంపాల్సి ఉంటుంది.. నిర్ణయించుకొని చెప్పండి అంటూ బిగ్‌బాస్ అన్నాడు. దీంతో రెండు క్లాన్లు చర్చించుకుని ఓజీ నుంచి విష్ణుప్రియను, రాయల్​ నుంచి టేస్టీ తేజను చీఫ్ కంటెండర్స్​గా ఎన్నుకున్నారు. దీంతో పృథ్వీ, నిఖిల్, రోహిణి, తేజ, ప్రేరణ, విష్ణుప్రియ.. చీఫ్ కంటెండర్లు అయ్యారని బిగ్‌బాస్ ప్రకటించాడు. అయితే ఇక్కడ ఈ ఆరుగురిలో విష్ణుప్రియ మెగా చీఫ్​ అయ్యింది. అయితే ఇక్కడ ఆటను మలుపు తిప్పింది మాత్రం హరితేజ. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..

మెగా చీఫ్‌ను ఎన్నుకునే ప్రక్రియ మొదలుపెట్టాడు బిగ్‌బాస్. "ఎన్నో అడ్డంకులు దాటుకొని మీలో ఒకరు మెగా చీఫ్ అవ్వడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు.. కానీ మీలో నుంచి ఎవరిని మెగా చీఫ్ చేయాలి.. ఎవరిని తప్పించాలనేది.. మీతోటి ఇంటి సభ్యుల ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. మెగా చీఫ్ కంటెండర్లందరూ పూల దండలు ధరించాలి. మిగిలిన ఇంటి సభ్యులు బజర్ మోగినప్పుడు వెళ్లి మిరపకాయను దక్కించుకోవాలి. ఎవరైతే ముందుగా వెళ్లి మిరపకాయ్ దక్కించుకుంటారో వారు వెళ్లి మెగా చీఫ్‌గా ఉండటానికి అనర్హుడని భావించే సభ్యుడి మెడలో నుంచి పూల మాల తీసి మిరపకాయల దండ వేసి అందుకు తగిన కారణాలు చెప్పాలి.. ప్రక్రియ ముగిసే సమయానికి ఎవరి మెడలో అయితే పూల దండ ఉంటుందో వాళ్లు మెగా చీఫ్ అవుతారు" అంటూ బిగ్‌బాస్ చెప్పాడు.

"అయితే ఒకసారి మిరపకాయ దక్కించుకున్న సభ్యుడు మరోసారి మిరపకాయను పట్టుకోవడానికి వీల్లేదు.. ఇక ఒకసారి మిరపకాయ దండ ధరించిన సభ్యుడు మెగా చీఫ్ రేసు నుంచి తప్పుకుంటారు.. తప్పుకున్న వారు తదుపరి రౌండ్ నుంచి మిరపకాయ దక్కించుకుకోవడానికి ప్రయత్నించొచ్చు.. మొదటి రౌండ్‌కి గౌతమ్ సంచాలక్.. తదుపరి రౌండ్ నుంచి మిరపకాయ్‌ను దక్కించుకున్న సభ్యుడు ఉండాల్సి ఉంటుంది" అంటూ బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు.

ఇక ఇలా బజర్ మోగిన వెంటనే ఫస్ట్ మొదటిగా మిరపకాయ్ అందుకున్నాడు మెహబూబ్. "ఓజీ క్లాన్ సభ్యులందరూ చాలా బాగా ఆడారు.. కానీ మా క్లాన్ వాళ్లని తీసేయడం నాకు ఇష్టం లేదు.. అందుకే సారీ" అంటూ ప్రేరణ మెడలో మిరపకాయల దండ వేశాడు మెహబూబ్. దీంతో ప్రేరణ ఏడ్చింది.. పృథ్వీ ఓదార్పాడు. ఆ తర్వాత మిరపకాయను నబీల్ అందుకున్నాడు. "మీరు క్లాన్ గేమ్ ఆడారు.. నేనూ అలానే ఆడి రోహిణిని తీసేస్తున్నా" అంటూ నబీల్ చెప్పాడు.

మలుపు తిప్పిన హరితేజ: ఇక మధ్యలో దొరికిన గ్యాప్‌లో రాయల్స్ టీమ్ మాట్లాడుకుంది. ఈ క్రమంలోనే తన క్లాన్‌కి హరితేజ ఓ సలహా ఇచ్చింది. "మన క్లాన్ నుంచి ఇక తేజ మాత్రమే ఉన్నాడు. మనం ఎంత ట్రై చేసినా కనీసం ఒక్కసారైనా వాళ్లకి మిరపకాయ దొరుకుతుంది.. అప్పడు మనోడిని తీసేస్తారు.. కనుక మనం వాళ్ల దాంట్లో ఎవరిని చీఫ్‌గా చేయాలని కూడా ప్లాన్ చేయాలి.. పృథ్వీని మనం గేమ్‌లోనే భరించలేం.. చీఫ్‌గా భరిస్తారా.. కనుక విష్ణుని తీయకుండా పృథ్వీని లేపేద్దాం" అంటూ సలహా ఇచ్చింది. దీనికి రాయల్స్ క్లాన్ అందరూ ఓకే అన్నారు.

బిగ్​బాస్​ 8: ఆరో వారం కిర్రాక్​ సీత అవుట్​ - రెమ్యునరేషన్​ వివరాలు లీక్​!

ఆ తర్వాత అవినాష్ చేతికి మిరపకాయ దొరికింది. దీంతో ముందే అనుకున్నట్లు పృథ్వీని తీసేశాడు అవినాష్. "ఈ వారం టాస్కుల్లో పృథ్వీ చాలా బాగా ఆడాడు.. కానీ మిగిలిన ముగ్గురిలో ఎవరైనా చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నా అందుకే తీసేశా" అంటూ అవినాష్ అన్నాడు. ఆ తర్వాత విష్ణు దగ్గరికెళ్లి "నిన్ను సపోర్ట్ చేద్దామనే పృథ్వీని తీసేసాం.. నువ్వు అర్థమయ్యేలా చెప్పు పృథ్వీకి" అంటూ అవినాష్ చెప్పాడు. దీనికి "మేము ఇద్దరం మాట్లాడుకోవడం లేదు" అంటూ విష్ణు అంది. ఆ తర్వాత పృథ్వీ మిరపకాయ్ను అందుకొని తేజను తీసేశాడు.. "రెండు వారాలుగా మీ క్లాన్ వాళ్లే చీఫ్ అయ్యారు..కనుక మా క్లాన్ వాళ్లు అవ్వాలని అనుకుంటున్నా" అంటూ రీజన్ చెప్పాడు. ఇక చివరిగా నిఖిల్-విష్ణుప్రియ మిగిలారు. "బయట మిరపకాయ తీసుకునే వాళ్లలో గౌతమ్ మాత్రమే స్ట్రాంగ్‌గా ఉన్నాడు. దీంతో నువ్వు టెన్షన్ తీసుకోకు. గౌతమ్‌కి దొరికితే నువ్వే చీఫ్.. వాడు నిన్నే చేస్తాడు" అంటూ విష్ణుతో అన్నాడు నిఖిల్.

ఊహించినట్లే గౌతమ్ చేతికి మిరపకాయ దొరికింది. దీంతో "లేడీస్ వీక్‌లో నేను లేడీకి సపోర్ట్ చేద్దామనుకుంటున్నా.. అయితే ఒక కండీషన్ ఉంది.. విష్ణు నువ్వు ఇప్పటివరకూ కంటెస్టెంట్ కానీ ఇప్పుడు చీఫ్ అవుతున్నావ్ కాబట్టి ఎవరైనా ఒకరిని ఫేవరెట్‌గా కాకుండా అందరినీ ఒకేలా చూడాలని కోరుకుంటున్నా" అంటూ గౌతమ్ చెప్పాడు. నిఖిల్ మెడలో మిరపకాయల దండ వేశాడు. దీంతో చీఫ్ అయిన విష్ణుకి హరితేజ-నయని కిస్ కంగ్రాట్స్ చెప్పారు. తర్వాత ఓజీ క్లాన్ శుభాకాంక్షలు చెప్పింది. అయితే అందరూ విష్ణుకి హగ్గు ఇచ్చి కంగ్రాట్స్ చెబితే అందరికంటే చివర వెళ్లి కేవలం షేక్ హ్యాండ్ ఇచ్చాడు పృథ్వీ. ఇక తనను చీఫ్ చేసినందుకు హౌజ్​ మొత్తానికి సాష్టాంగ నమస్కారాలు.. చేసింది విష్ణు.

అయితే ఈ మెగా చీఫ్ ఎంపిక ప్రారంభమయ్యే ముందు కంటెండర్స్ అందరికీ ఒక్కొక్క ఎన్వ్​లప్ పంపించాడు బిగ్‌బాస్. మెగా చీఫ్ అయిన విష్ణుని తన చేతిలోని కవర్ ఓపెన్ చేయమని చెప్పాడు బిగ్‌బాస్. ఎన్వ్​లప్‌లో ఉన్న ప్రైజ్ మనీ విన్నర్స్ ప్రైజ్ మనీలోకి యాడ్ అవుతుంది.. అంటూ చెప్పాడు. అందులో రూ.2 లక్షలు ఉంది. ఇక ఈ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ప్రైజ్ మనీ రూ.40.16 లక్షలకు చేరింది.

బిగ్​బాస్​ 8: ఏడో వారం నాగ మణికంఠ అవుట్​ - ఉండలేనంటూ సెల్ఫ్​ ఎలిమినేషన్​ - రెమ్యునరేషన్​ వివరాలివే!

మరో షాకిచ్చిన నాగ మణికంఠ - భార్య కంటే ఎన్నేళ్లు చిన్నోడో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details