Vishal Madha Gaja Raja :కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ లీడ్ రోల్లో నటించిన 'మదగజ రాజ'. ఈ సినిమా 12ఏళ్ల కిందటే ప్రారంభమై 2013లో షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే పలు కారణాల వల్ల ఇది రిలీజ్‌కు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లలో అలరించేందుకు సిద్ధమైంది. 2025 సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ సినిమా జనవరి 12న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
12ఏళ్ల తర్వాత విశాల్ మూవీకి మోక్షం- సంక్రాంతికి రిలీజ్ - MADHA GAJA RAJA MOVIE
థియేటర్లలోకి 'మదగజ రాజ'- షూటింగ్ పూర్తైన 12ఏళ్ల తర్వాత రిలీజ్‌కు రెడీ
Vishal Madha Gaja Raja (Source : ETV Bharat)
Published : Jan 3, 2025, 3:38 PM IST
డైరెక్టర్ సుందర్ సి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కామెడీ, ఫ్యామిలీ డ్రామా జానర్లో ఈ చిత్రం రూపొందింది. తెలుగు నటి అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. సీనియర్ నటుడు సంతానం, తదితరులు ఆయా పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ అంటోనీ సంగీతం అందించారు. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది.