Vijay Thalapathy Heroine Rambha Family Photos :హీరోయిన్ రంభ గురించి చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ఒకప్పుడు టాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా పేరు పొందిన వారిలో ఆమె కూడా ఒకరు. ముఖ్యంగా ఆమె అందానికి ప్రతిఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. అంతటి అందం ఆమె సొంతం. అల్ట్రా మోడరన్‌గా కనిపించినా, బికినీ వేసినా, చీర కట్టినా ఈమెకే చెల్లింది.
తెలుగులో ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో పరిచయమైన ఈ భామ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారూ బాగున్నారా, బొంబాయి ప్రియుడు ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్‌గానే కాదు స్పెషల్ సాంగ్స్‌లోనూ చిందులేసి మెప్పించింది. కానీ పెళ్లి తర్వాత రంభ సినిమాలకు దూరమైంది. మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది.
అయితే తాజాగా ఈ భామ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె కుటుంబమంతా కలిసి దళపతితో ఫొటోలు దిగారు. రంభకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఆ పిక్స్‌నే ఆమె నెట్టింట్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ పిక్స్‌లో రంభ పెద్ద కూతురు కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అచ్చం తల్లిలానే ఎంతో అందంగా కనిపించిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.