Vijay Sethupathi Viduthalai Part 2 First Look Poster : ప్రముఖ కమెడియన్ సూరి హీరోగా తెరకెక్కిన చిత్రం విడుదలై. కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ దీన్ని తెరకెక్కించారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో వచ్చిన ఈ చిత్రం తమిళం, తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచింది. అలానే ఈ చిత్రంలో విజయ్, సూరి నటనకు మంచి పేరుతో పాటు అవార్డులు దక్కాయి!
అయితే ఇప్పుడు త్వరలోనే రెండో భాగం విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఒక పోస్టర్లో పొలంలో కత్తి పట్టి పరిగెడుతూ శత్రువులను వేటాడుతున్న విజయ్ సేతుపతి వైలెంట్‌గా చూపించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ను ఈ పోస్టర్‌ను తెలియజేస్తోంది. అలానే రెండో పోస్టర్లో తన భార్య పాత్ర పోషిస్తున్న మంజు వారియర్‌తో సైకిల్ పట్టుకుని నిలబడిన సేతుపతి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు ట్రెండింగ్‌గా మారాయి. సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇకపోతే రీసెంట్గా విజయ్ సేతుపతి మహారాజ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ చిత్రం థియేటర్లలో విడుదలై రూ.100 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి గాంధీ టాక్స్ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఇది షూటింగ్ జరుపుకుంటోంది.