Vijay Sethupathi Maharaja:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి 50వ సినిమాగా తెరకెక్కిన 'మహారాజ' భారీ విజయం సాధించింది. జూన్ 14న రిలీజైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. వరల్డ్‌వైడ్‌గా రూ.100కోట్ల మార్క్ దాటింది. అనేక రికార్డులు బద్దలుకొట్టిన ఈ మూవీ గతనెల నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలోనే మహారాజ అరుదైన ఘనత సాధించింది.
ఓటీటీలో రిలీజై ఆరు వారాలు గడుస్తున్నా మహారాజ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లోనే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక మంది చూసిన సినిమాగా రికార్డ్ కొట్టింది. 18.6మిలియన్ వ్యూస్‌తో నెట్‌ఫ్లిక్స్ 2024లో టాప్‌లో నిలిచింది. ఇదివరకు ఈ రికార్డు 17.9మిలియన్లు క్రూ (Crew) సినిమాపై ఉండేది. వీటి తర్వాత లాపతా లేడీస్ (Laapataa Ladies) 17.1 మిలియన్లు మూవీని అత్యధిక మంది వీక్షించారు.
కాగా, ఈ సినిమాకు డైరెక్టర్ నిథిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. భారీ గ్రాఫిక్స్‌తో పనిలేకుండా సింపుల్‌గా ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, భారతీరాజా, అభిరామ్ తదితరులు ఈ సినిమాలో నటించారు. సుదన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అజనీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు.