తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అందుకే తెలుగులో ఇప్పటి వరకు సినిమాలు చేయలేదు' - Vijay Sethupathi Maharaja Movie - VIJAY SETHUPATHI MAHARAJA MOVIE

Vijay Sethupathi Maharaja Movie : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి తాజాగా 'మహారాజ' సినిమాతో హిట్‌ అందుకున్నాడు. అయితే ఆయన్ను చాలా ఇంటర్వ్యూల్లో తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. దానికి విజయ్‌ సేతుపతి ఏం చెప్పారంటే?

Vijay Sethupathi Maharaja Movie
Vijay Sethupathi Maharaja Movie (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 18, 2024, 10:28 PM IST

Vijay Sethupathi Maharaja Movie :విలక్షణ నటుడు యాక్టర్ విజయ్ సేతుపతి తన 50వ సినిమా 'మహారాజ'తో హిట్‌ కొట్టారు. ఈ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా ఇంటర్వ్యూల్లో విజయ్‌ సేతుపతికి "తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు?" అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

"నేను తెలుగు సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చాలా కథలు విన్నాను, వాటిలో కొన్ని చాలా బాగున్నాయి. కానీ నాకు ఆఫర్‌ చేసిన పాత్రలు నన్ను పెద్దగా ఆకట్టుకోలేదు. కొన్ని కథలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఆ పాత్రకు నేను సూట్‌ కానని భావించాను. ఈ కారణాలతో ఆ ప్రాజెక్ట్‌లకు దూరంగా ఉండాలనుకున్నాను." అని విజయ్​ చెప్పారు.

రొమాంటిక్‌ డ్రామాల్లో నటించడం ఇష్టం
"మీకు ఏ తెలుగు దర్శకుడితోనైనా పని చేయాలని ఉందా?" అని అడగ్గా. "నేను ఆ కోణంలో ఆలోచించను. నేను ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నాను అని అడిగితే, నేను మీకు సమాధానం చెప్పగలను. రొమాంటిక్ డ్రామాల్లో నటించడమంటే నాకు చాలా ఇష్టం. దర్శకులు గొప్ప కథలతో నా దగ్గరకు వస్తారు. ఇంత అద్భుతమైన కథలు ఎలా తయారు చేస్తున్నారా అని ఆశ్చర్యపోతుంటాను." అని రిప్లై ఇచ్చారు.

డైరెక్షన్‌ చేయాలని ఉంది
కెరీర్‌ ప్లాన్స్‌ గురించిం కూడా ఆయన ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు. "గతాన్ని మోసుకుంటూ ప్రయాణం చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇంతకు ముందులానే ఇకపై కూడా నా కెరీర్‌ కొనసాగుతుంది. కలలు, అంచనాలు ఎప్పుడూ భారమే. అందుకే రోజూ కెమెరా ముందుకు కొత్తగా వెళతాను. సినిమా విషయంలో అదే రకమైన థ్రిల్‌తో ఉంటా. ఇకపైనా ఇంతే బాధ్యతతో పనిచేయడమే నా వ్యూహం. మంచి కథ కుదిరితే తప్పకుండా దర్శకత్వం చేస్తా. మూడు సినిమాలకి కథ, స్క్రీన్‌ప్లే రాశాను. మరికొన్ని కథలూ రాసుకున్నా. కథానాయకుడిగా ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నా. హిందీలో ఓ సినిమా చేస్తున్నా." అని విజయ్ చెప్పారు.

'మహారాజా' రెస్పాన్స్ అదుర్స్- 24 గంటల్లోనే 2 లక్షల టికెట్లు సోల్డ్ - Maharaja Movie Tickets

'స్టోరీ వినగానే 50వ సినిమాగా ప్రకటించాను - ఇకపై అదే నా ఫ్యూచర్ ప్లాన్' - Vijay Sethupati Maharaja Movie

ABOUT THE AUTHOR

...view details