Vijay Devarkonda Rashmika : చిత్ర పరిశ్రమలో హీరో విజయ్ దేవరకొండ - హీరోయిన్ రష్మికలకు ఉన్న ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. వీరిద్దరూ ఎక్కడ కనిపించినా ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపించడం, ఫ్యాన్స్ ఆనందపడటం జరుగుతుంటుంది. అదే వీరిద్దరు కలిసి కనిపిస్తే ఇక ఆ రోజు అంతా సోషల్ మీడియా వీరి హవానే కొనసాగుతుంటుంది. వీరిద్దరి రిలేషన్షిప్ గురించి గాసిప్స్ చక్కర్లు కొడుతూనే ఉంటాయి.
అయితే తాజాగా ఈ జంట ముంబయి విమానాశ్రయంలో తళుక్కున కనిపించి మరోసారి సర్ప్రైజ్ ఇచ్చారు. సోమవారం రాత్రి వీరిద్దరూ ముంబయి ఎయిర్ పోర్ట్‌లో కనిపించారు. అయితే ముందుగా ఎయిర్ పోర్ట్కు వచ్చిన రష్మిక ఫొటో గ్రాఫర్లకు పోజులిచ్చింది. అభిమానులతో కలిసి ఫొటోలు దిగి సందడి చేసింది.
ఇది జరిగిన కాసేపటికే విజయ్ దేవరకొండ కూడా అక్కడ కనిపించి సందడి చేశారు. దీంతో వీరిద్దరూ క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్తున్నారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇటీవలే ఈ జంటకు సంబంధించిన ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. రెస్టారంట్‌లో వీరిద్దరూ కలిసి కనిపించారు.
కాగా, విజయ్ దేవరకొండ - రష్మిక రిలేషన్షిప్లో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై విజయ్ దేవరకొండ, రష్మిక ఇప్పటికే పలు సార్లు స్పందించారు. తామిద్దరు మంచి స్నేహితులం అని అన్నారు. అయినప్పటికీ వీరిపై గాసిప్స్ మాత్రం ఆగట్లేదు.