తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పుష్ప 2'కు పోటీగా రష్మిక కొత్త హిందీ సినిమా - పవర్​ ఫుల్​ టీజర్ రిలీజ్​​ - vicky Kaushal Rashmika Chava - VICKY KAUSHAL RASHMIKA CHAVA

vicky Kaushal Rashmika Chava Teaser Released : బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌, నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న మూవీ 'ఛావా'. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం అఫీషియల్​గా రిలీజ్ డేట్​ను కూడా అనౌన్స్​ చేసింది.

source ETV Bharat ANI
alluarjun rashmika vicky kaushal (source ETV Bharat ANI)

By ETV Bharat Telugu Team

Published : Aug 19, 2024, 12:15 PM IST

Updated : Aug 19, 2024, 2:01 PM IST

vicky Kaushal Rashmika Chava Teaser Released : బాలీవుడ్​లో బయోపిక్​ల ట్రెండ్​ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చరిత్రలో నిలిచిపోయిన ప్రముఖుల జీవిత కథలను తెరకెక్కిస్తున్నారు. 'సామ్రాట్ పృథ్వీరాజ్', 'తానాజీ', 'పానిపట్', 'బాజీరావ్ మస్తానీ', 'పద్మావత్' వంటి చిత్రాలు ఇప్పటికే మంచి వసూళ్లను సాధించాయి. ఇప్పుడు మరో హిస్టారికల్ మూవీ రాబోతుంది. దాని పేరు 'ఛావా'.

బాలీవుడ్​ హీరో విక్కీ కౌశల్‌, నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోందీ చిత్రం. 'మిమి', 'చుప్పి' ఫేమ్ దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఇది రూపొందుతోంది. సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో నటించనుంది రష్మిక. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం అఫీషియల్​గా రిలీజ్ డేట్​ను కూడా అనౌన్స్​ చేసింది. డిసెంబర్‌ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది.

ఈ ప్రచార చిత్రంలో వందలాది మంది శత్రువులతో పోరాడే యుద్ధ వీరుడు సాంబాజీగా తన నట విశ్వరూపం చూపించారు విక్కీ కౌశాల్​. అలాగే రష్మిక మందన్నా కూడా ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ టీజర్ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే పలువురు నెటిజన్లు, సినీ ప్రియులు ఛావాలోని విక్కీ కౌశల్ పాత్రను బాజీరావ్ మస్తానీ చిత్రంలో రణవీర్ సింగ్ తో పోలుస్తు కామెంట్లు చేస్తున్నారు.

కాగా, విక్కీ కౌశల్, లక్ష్మణ్ కాంబోలో గతంలో 'జరా హాట్కే జరా బచ్కే'లో సినిమా విడుదలైంది. 2023లో విడుదలైన ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్​గా ఆడియెన్స్​ను బాగా అలరించింది. దీంతో ఇప్పుడీ కాంబో మళ్లీ రిపీట్ అవ్వడం వల్ల ఛావాపై అంచనాలు కూడా ఉన్నాయి.

ఒకేరోజు రెండు పాన్ ఇండియా చిత్రాలు - ఇకపోతే ఛావా రిలీజ్ రోజునే(డిసెంబర్​ 6) అల్లు అర్జున్​ - రష్మిక కలిసి నటించిన పుష్ప 2(Pushupa 2 VS Chava) కూడా థియేటర్లలో విడుదల కానుంది. దీనిపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా నార్త్​లో ఫుల్ హైప్ ఉంది. దీంతో బాలీవుడ్ బాక్సాఫీస్​ ముందు మరో టఫ్​ ఫైట్​ ఖాయమైనట్టైంది.

బాక్సాఫీస్ ఫైట్​ కన్ఫామ్​ - ఒకేరోజు వేట్టయాన్​, కంగువా - Vettaiyan VS Kanguva

ఈ వారం 17 సినిమాలు ​ - మూవీ లవర్స్ దృష్టంతా ఆ మూడు సినిమాలపైనే! - This Week OTT Theatre Releases

Last Updated : Aug 19, 2024, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details