Vangala Viriguda Kurunila Mannan Movie :ఆన్ ది స్క్రీన్ హీరో శాసిస్తే, బిహైండ్ ది స్క్రీన్ డైరెక్టర్ శాసిస్తాడు. అయితే ఓ సినిమా రూపొందాలంటే వీరిద్దరు మాత్రమే ఉంటే సరిపోదు. ఓ మూవీ హిట్ అవ్వాలన్నా, ఫ్లాప్ అవ్వాలన్నా వీరిద్దరితో పాటు 24 విభాగాలు కలిసి పనిచేయాలి ఉంటుంది. అప్పుడే ఓ చిత్రం తెరపై వస్తుంది. అయితే కొన్ని సార్లు మన హీరోలు లేదా హీరోయిన్స్ ఇతర నటులు, డైరెక్టర్స్ మల్టీటాలెంట్ కూడా ఉంటారు. ఒకేసారి రెండు, మూడు క్రాఫ్ట్స్‌ను ఒకరే హ్యాండిల్ చేస్తుంటారు. అలా తాజాగా ఓ మల్టీటాలెంటెడ్ నటుడు స్వయంగా ఏకంగా 21 విభాగాలను హ్యాండిల్ చేసి ఓ సినిమాను రూపొందించి ఆశ్యర్యపరిచారు. ఆయనే గుగన్ చక్రవర్తి.
కోలీవుడ్‌కు చెందిన గుగన్ తాజాగా తెరకెక్కించిన చిత్రం 'వంగల వీరిగూడ కురునిల మన్నన్'. భారత మాజీ రాష్ట్రపతి, అబ్దుల్ కలాం కలలు కన్న మన ప్రజల అందమైన జీవితం అనే కాన్సెప్ట్‌తో రూపొందించారు. కోలీవుడ్‌లో ఓ సినిమా కోసం ఇలా 21 విభాగాలకు పనిచేసిన తొలి సోలో ఆర్టిస్ట్ ఈయనే కావడం విశేషం.
ఈ సినిమాకు గుగన్ చక్రవర్తియార్ కథ, స్క్రీన్‌ప్లే, లిరిక్స్, సాంగ్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్, డ్యాన్స్, ఫైట్ ట్రైనింగ్ (ఇండివిడ్యువల్), కాస్ట్యూమ్స్, స్టిల్స్, మేకప్, ప్లేబ్యాక్ సింగర్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ డిజైన్, టైటిల్, హెయిర్‌స్టైలింగ్, అవుట్‌డోర్ సెట్ మేనేజర్, ప్రొడక్షన్, డైరెక్షన్ వంటి సేవలు అందించారు.
ఇకపోతే మాత పిత ఫిల్మ్ ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించింది. తాజాగా ఈ మూవీ ఆడియో, ట్రైలర్ లాంచ్ చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా సినిమాలో 21 విభాగాలకు పని చేసిన నిర్మాత, దర్శకుడు, నటుడు గుగన్ చక్రవర్తియార్ తాను ప్రజల రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఎందుకు వ్యతిరేకించాను నా సినిమా చూసి తెలుసుకోండని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర సినీ ప్రముఖులు గరుడానంద స్వామిగల్, స్నేహన్, జెస్సికా, తిరునావుకరసు, టికె షణ్ముగం, కలైమామణి ప్రభాకరన్, శంకర్ కూడా పాల్గొన్నారు.
గుగన్ చక్రవర్తియార్ మాట్లాడుతూ - "నాకు నచ్చిన ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకున్నాను, అదే ఈ సినిమా. పెరియార్, అన్నా, కరుణానిధి, ఎంకే స్టాలిన్, అబ్దుల్ కలాంలను ఒకే పోస్టర్‌లో తీసుకురావాలనే ఆలోచనతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో ముఖ్యమంత్రికి ఓ విన్నపం చేశాను. అబ్దుల్ కలాం మీద నాకు ద్వేషం ఉందని సినిమాలో చూపించాను, అందరూ ఖండించారు. అయితే ఎందుకో సినిమా చూసి తెలుసుకోవాలి. కరుణానిధి మాట్లాడిన ఈ వేదికపై ఈరోజు మాట్లాడుతున్నందుకు గర్వంగా ఉంది. డబ్బున్న వాడు అన్నీ సినిమాలు తీయలేడు. సినిమా బాగుంటే మెచ్చుకుంటారు. ఏదీ సులభంగా రాదు" అని పేర్కొన్నాడు.
వేడుకలో గీత రచయిత స్నేహన్ మాట్లాడుతూ - "ఈ వేదిక చాలా ముఖ్యమైంది. మనం విజేతల గురించి మాట్లాడే వేదిక కన్నా ఇది భిన్నమైన వేదిక అని నేను భావిస్తున్నాను. దానికి కారణం మాప్పిళ్లై గుగన్. నేను అతనితో జర్నీ ప్రారంభించినప్పటి నుంచి ఆయన్ను ఉత్సాహంగా పరుగెత్తే మనిషిలా చూశాను. అలుపెరగని కృషి వల్లే ఆయనకు ఈ స్థాయి దక్కింది. ఎన్నో కష్టాల మధ్య ఈ సినిమా తీశాడు. ఎన్ని సమస్యలున్నా ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటాడు. కష్టపడి పనిచేసేవాడు ఎప్పటికీ ఓడిపోడు" అని చెప్పారు.
విజయ్ కోసం ఈ ఇద్దరిలో ఎవరు ఓకే చెబుతారో? - Gowtam Tinnanuri Vijay Devarakonda
'కల్కి'పై హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కామెంట్స్ - ఆ స్థాయిలో లేరంటూ! - Prabhas Kalki 2898 AD