తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వాలెంటైన్ డే స్పెషల్‌ సాంగ్స్‌- మీ పార్ట్‌నర్‌కి ఓ పాట డెడికేట్‌ చేసేయండి! - VALENTINES DAY SPECIAL TELUGU SONGS

తెలుగు టాప్ లవ్ సాంగ్స్- ప్రేమికుల ఫేవరెట్ ప్లే లిస్ట్ ఇదే!

Valentines Day Special Love Songs In Telugu
Valentines Day Special Love Songs In Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2025, 7:07 AM IST

Valentines Day Special Tollywood Songs : వాలెంటైన్స్​ డేని ఒక్కొక్కరుఒక్కోలా ప్లాన్‌ చేసుకుంటారు. మీరు ఔటింగ్‌కి వెళ్తున్నా, లంఛ్‌ లేదా డిన్నర్‌కి ఏర్పాట్లు చేసినా, మంచి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ సిద్ధం చేసినా సరే ఓ మంచి లవ్‌ సాంగ్‌ ప్లే చేస్తే ఆ ఫీలే వేరు. అప్పుడే ఏ సాంగ్‌ అయితే బావుంటుందని ఆలోచిస్తున్నారా? మీకా శ్రమ అక్కర్లేదు. ఇటీవల కాలంలో లవర్స్‌ రిపీటెడ్‌గా వింటున్న టాప్‌ సాంగ్స్‌ లిస్ట్‌ మీకు అందిస్తున్నాం. ఓ మంచి పాటను మీ పార్ట్‌నర్‌కి డెడికేట్‌ చేసేయండి.

బుజ్జితల్లి
ఇటీవల తెలుగు ప్రేక్షకులకు మంచి ప్రేమ కథను చూపించిన మూవీ 'తండేల్‌'. ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన 'బుజ్జితల్లి' సాంగ్‌ కూడా అంతే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. రిలీజైన కొద్ది గంటల్లోనే మంచి వ్యూవ్స్​ సంపాగించదుకుని అందరికీ తెగ నచ్చేసింది. అంతేకాకుండా ఈ సాంగ్‌ చాలా మంది ఫేవరెట్‌ లిస్టులో చేరిపోయింది.

మాస్టారు మాస్టారు
తమిళ నటుడు ధనుశ్​, సంయుక్తా మేనన్‌ లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన మూవీ 'సార్‌'. ఇందులోని 'మాస్టారు మాస్టారు' సాంగ్‌ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది.

ఓ రెండు ప్రేమ మేఘాలిలా
ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా 'బేబీ'లోని 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' పాట చాలా మంది లవర్స్‌కి ఫేవరెట్‌ సాంగ్‌. ఈ పాట విని అందమైన జ్ఞాపకాలోకి జారిపోని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు!

సామజవరగమన
త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన మూవీ 'అల వైకుంఠపురములో'. 2020లో వచ్చిన ఈ సూపర్‌ హిట్‌ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలోని అన్ని పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. చాలా మంది ప్రేమికుల మనసును గిలిగింతలు పెట్టిన పాట మాత్రం 'సామజవరగమన'. ఈ పాట అప్పట్లో 'సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా కూడా నిలిచింది.

సుట్టంలా సూసి పోకలా
విశ్వక్‌సేన్‌, నేహాశెట్టి జోడీగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన సినిమా 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి'. 2024లో వచ్చిన ఈ మూవీకి యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్‌ అందించాడు. ఇందులోని లవ్‌ సాంగ్‌ ‘సుట్టంలా సూసి పోకలా’ పాట ఒక్కసారి వింటే ఇక వదలరు, మళ్లీ మళ్లీ వింటూనే ఉంటారు.

శ్రీమతి గారు
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి నటించిన మూవీ 'లక్కీ భాస్కర్'లోని 'శ్రీమతి గారు' పాట చాలా మందిని ఆకట్టుకుంది. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది. వాలెంటైన్‌ డే సెలబ్రేషన్‌కి మంచి ఫీల్‌ క్రియేట్‌ చేస్తుంది.

నువు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే
ఈ పాపులర్‌ సాంగ్‌ 'మ్యాడ్‌' సినిమాలోనిది. 2024లో రిలీజ్‌ అయిన ఈ హిట్‌ మూవీలో నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌, గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్‌, గోపికా ఉద్యాన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్‌ యూత్‌ ఎంటర్‌టైనర్‌లోని 'నువు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే' పాటకి సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. వాలెంటైన్‌ డే రోజు ఈ పాట ప్లే చేశారంటే మంచి వైబ్‌ సెట్‌ అవుతుంది.

వాలంటైన్స్‌ డే : టాలీవుడ్ బెస్ట్ లవ్​ డైలాగ్స్​ - ఇవి​​ చెప్పి మనసు దోచేయండి బ్రదర్స్​!

వాలంటైన్స్ డే స్పెషల్.. బాలయ్య ప్రేమ పాఠాలు!

ABOUT THE AUTHOR

...view details