Upcoming Bollywood Horror Movies : సాధారణంగా హారర్ సినిమాలకు అన్ని ఇండస్ట్రీల్లో మంచి క్రేజ్ ఉంది. ఓ వైపు భయపెడుతూనే మరోవైపు థ్రిల్ పంచే సినిమాలను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. 80స్ నుంచే ఈ తరహా సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అయితే బాలీవుడ్లో ఈ ఫార్ములా మంచి సక్సెస్ సాధించింది. 'స్త్రీ సిరీస్', 'భేడియా', 'ముంజ్య' లాంటి సినిమాలు వీటికి పెర్ఫెక్ట్ ఉదాహరణలని చెప్పొచ్చు. అయితే ఇటువంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను బాలీవుడ్‌కు అందించింది మాత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్.
దినేశ్ విజన్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రాలన్నీ హారర్ ప్రియుల్ని అలరించి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడీ ఫార్ములాను ఉపయోగించి మరికొన్ని హిట్ చిత్రాలకు సీక్వెల్స్ తీసుకొస్తోంది నిర్మాణ సంస్థ. గురువారం ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒకేసారి ఎనిమిది సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలను ప్రకటించింది ఆ సంస్థ. మరి ఆ సినిమాలేవో, వాటి రిలీజ్ గురించి
నేషనల్ క్రష్ రష్మిక, బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'థామా'. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా దీపావళికి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.
'స్త్రీ' ఈజ్ బ్యాక్
ఓ వైపు వణుకు పుట్టిస్తూనే మరోవైపు కడుపుబ్బా నవ్వించింది 'స్త్రీ'. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు లాంటి స్టార్స్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ వచ్చింది. తాజాగా దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'స్త్రీ 2' కూడా బీటౌన్‌లో అనేక రికార్డులు బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడీ సినిమా మూడో భాగం కూడా రానున్నట్లు ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసింది నిర్మాణ సంస్థ. 2027 ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది.