తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

టాలీవుడ్ బడా హీరోల సినిమాలు - షూటింగ్ ఎక్కడి దాకా వచ్చిందంటే? - Tollywood Upcoming Movies - TOLLYWOOD UPCOMING MOVIES

Tollywood Upcoming Movies 2024 Shooting Update : టాలీవుడ్​ స్టార్ హీరోలంతా ప్రస్తుతం వరుస సినిమాలతో సెట్స్​పై బిజీగా గడుపుతున్నారు. కొందరేమో కొత్త చిత్రాలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతుంటే, మరికొందరు మిగిలిన షూటింగ్​ పార్ట్​లను పూర్తి చేయడంలో నిమగ్నైపోయారు. మరి ఇంతకీ సెట్స్‌పై ముస్తాబవుతున్న చిత్రాలేంటి? అలాగే త్వరలో చిత్రీకరణ ప్రారంభించుకోనున్న భారీ ప్రాజెక్ట్‌లు ఏంటి ఈ కథనంలో తెలుసుకుందాం.

source ETV Bharat
Tollywood Upcoming Movies 2024 Shooting Update (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2024, 6:52 AM IST

Tollywood Upcoming Movies 2024 Shooting Update : టాలీవుడ్​ స్టార్ హీరోలంతా ప్రస్తుతం వరుస సినిమాలతో సెట్స్​పై బిజీగా గడుపుతున్నారు. కొందరేమో కొత్త చిత్రాలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతుంటే, మరికొందరు మిగిలిన షూటింగ్​ పార్ట్​లను పూర్తి చేయడంలో నిమగ్నైపోయారు. మరి ఇంతకీ సెట్స్‌పై ముస్తాబవుతున్న చిత్రాలేంటి? అలాగే త్వరలో చిత్రీకరణ ప్రారంభించుకోనున్న భారీ ప్రాజెక్ట్‌లు ఏంటి ఈ కథనంలో తెలుసుకుందాం.

Kalki 2898 AD Sequel Shooting - ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ కల్కి 2898ఎ.డి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1100కోట్ల వసూళ్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో భాగం చిత్రీకరణ గురించి నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంక దత్‌ స్పందించారు. ఈ సీక్వెల్‌ చిత్రీకరణ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుంచి మొదలు కానుందని చెప్పారు. ఇప్పటికే కల్కి 2కు సంబంధించి 20 రోజుల షూటింగ్​ పూర్తి చేసినట్లు గతంలో నాగ్‌ అశ్విన్‌ తెలిపారు.

Pushpa 2 premieres - అల్లు అర్జున్‌ నటిస్తున్న 'పుష్ప 2 : ది రూల్‌' డిసెంబరు 6న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్​ ప్రకటించింది. అయితే ఇప్పుడీ సినిమా ప్రీమియర్లపైనా కూడా చిత్ర నిర్మాతల నుంచి క్లారిటీ వచ్చింది. డిసెంబరు 5నే ప్రీమియర్లు వేసే ఆలోచనలో ఉన్నట్లు అధికారికంగా తెలిపారు. ప్రస్తుతం క్లైమాక్స్‌ షూటింగ్​ అనుకున్నట్లుగా జరుగుతోందని పేర్కొన్నారు. సెప్టెంబరు 2 నాటికి ఫస్ట్​ హాఫ్​ ఎడిటింగ్‌ పూర్తి చేస్తారని, అక్టోబరు 6కల్లా సెకండాఫ్​, నవంబరు 20కి కాపీ పూర్తవుతుందని అన్నారు. నవంబరు 25కి సెన్సార్‌ పూర్తి చేయాలన్న ప్రణాళికతో ఉన్నట్లు వెల్లడించారు. సెప్టెంబరు నెలాఖరులో ఒక సాంగ్​, అక్టోబరులో మరొక సాంగ్​ విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

Ustaad Bhagat Singh Shooting -పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న సినిమాల్లో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ కూడా ఒకటి. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకుందీ చిత్రం. పవన్‌ రాజకీయాలతో బిజీ అవ్వడం వల్ల తాత్కాలికంగా ఆగింది. అయితే ఇప్పుడీ సినిమాను మరికొన్ని వారాల్లో చిత్రీకరణను పునఃప్రారంభించనున్నట్లు మైత్రీ మూవీస్‌ క్లారిటీ ఇచ్చింది. డిసెంబరు, జనవరి నాటికి షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. అలాగే పవన్‌ పుట్టిన రోజు సెప్టెంబరు 2న ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు పేర్కొంది.

NTR 31 Prasanth Neel NTR Shooting - ఎన్టీఆర్ 31వ చిత్రానికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబరు నుంచి ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభంకానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఎన్టీఆర్‌ డిసెంబరు నుంచి చిత్రీకరణలో పాల్గొంటారని చెప్పింది. ఈ సినిమా కోసం 'డ్రాగన్‌' అనే పేరు ప్రచారంలో ఉంది.

పవన్ చేసిన కామెంట్స్​ 'పుష్ప 2' గురించేనా? - క్లారిటీ ఇచ్చిన నిర్మాత - Pawan kalyan on Pushpa 2

ఎస్​ జే సూర్య - 'వస్తాడు, సైకోయిజంతో అలరిస్తాడు, రిపీట్​' - SJ Suryah Saripoda Sanivaram

ABOUT THE AUTHOR

...view details