ETV Bharat / offbeat

జలుబు, దగ్గు, గొంతునొప్పికి అమృతంలా పనిచేసే - ఉడుపి స్టైల్ "మిరియాల రసం"! - ఈజీగా చేసుకోండిలా! - UDUPI STYLE PEPPER RASAM

నోరూరించే ఉడుపి స్టైల్ "మిరియాల రసం" - ఘాటుగా, కమ్మగా గొంతులోకి జారుతుంటే ఆ కిక్కే వేరబ్బా!

HOW TO MAKE PEPPER RASAM
Udupi Style Pepper Rasam Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2025, 1:14 PM IST

Udupi Style Pepper Rasam Recipe : వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో కారంకారంగా, ఘాటుఘాటుగా ఏదైనా రసం వేసుకుని తింటే ఆ ఫీలింగ్ సూపర్​గా ఉంటుంది. ముఖ్యంగా చలికాలం చాలా మందిని జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బందిపెడుతుంటాయి. దాంతో ఏమి తిన్నా నోటికి అంతగా రుచించదు.

అలాంటి టైమ్​లో ఓసారి ఇలా ఉడుపి స్టైల్​ మిరియాల రసం చేసుకొని చూడండి. చాలా రుచికరంగా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది! అంతేకాదు ఆయా సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది! పైగా దీని తయారీకి టమాటాలు, ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఏవి అవసరం లేదు. మరి, ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రసం తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • మిరియాలు - 1 టేబుల్​స్పూన్
  • నెయ్యి - అర టేబుల్​స్పూన్
  • నల్ల పొట్టు మినప్పప్పు - ఒకటిన్నర టేబుల్​స్పూన్లు
  • ధనియాలు - 1 టేబుల్​స్పూన్
  • జీలకర్ర - అరటీస్పూన్
  • ఎండుకొబ్బరి ముక్కలు/తురుము - 2 టేబుల్​స్పూన్లు
  • చింతపండు - ఉసిరికాయ సైజంత
  • పసుపు - అరటీస్పూన్
  • రాళ్ల ఉప్పు - రుచికి సరిపడా
  • బెల్లం తురుము - 1 టేబుల్​స్పూన్

తాలింపు కోసం :

  • నెయ్యి - అర టేబుల్​స్పూన్
  • ఆవాలు - అరటీస్పూన్
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఇంగువ - చిటికెడు

నోటికి కమ్మగా ఉండే "జీలకర్ర రసం" - ఇలా చేసుకుని తిన్నారంటే అజీర్తి, గ్యాస్ సమస్యలు ఔట్!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్​లో చింతపండును శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక మిరియాలు వేసి వేయించుకోవాలి.
  • మిరియాలు చిట్లుతున్నప్పుడు నల్ల పొట్టు మినప్పప్పు, ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్ మీద కాసేపు చక్కగా ఫ్రై చేసుకోవాలి.
  • అవి వేగాక జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. పప్పులన్నీ వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు ఆఖరున ఎండుకొబ్బరి ముక్కలు/తురుము వేసుకొని కాస్త ఎర్రగా మారే వరకు వేయించుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న మిరియాల మిశ్రమం, కొద్దిగా వాటర్ వేసుకొని కొంచం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి.
  • ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండును తీసుకొని చేతితో గట్టిగా పిండుతూ రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై మిరియాలు వేయించుకున్న కడాయి పెట్టుకొని చింతపండు రసం పోసుకోవాలి. ఆపై అందులో పసుపు, లీటర్ వాటర్, ఉప్పు వేసి కలిపి హై ఫ్లేమ్ మీద చారు మధ్యలో పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి.
  • ఆవిధంగా మరిగించుకున్నాక అందులో బెల్లం తురుము, ముందుగా గ్రైండ్ చేసుకున్న మిరియాల పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆపై హై ఫ్లేమ్ మీద మరోసారి 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. అనంతరం స్టౌను లో ఫ్లేమ్​కి టర్న్​ చేసి అలా వదిలేయాలి.
  • అనంతరం ఇంకో బర్నర్​ మీద చిన్న కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడెక్కాక ఆవాలు వేసుకొని చిట్లనివ్వాలి. ఆపై కరివేపాకు, ఇంగువ వేసి కలిపి చక్కగా వేయించుకోవాలి.
  • తాలింపు మంచిగా వేగాక దాన్ని తీసుకొని మరో బర్నర్​పై లో ఫ్లేమ్​ మీద మరిగించుకుంటున్న చారులో వేసి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత ఒక నిమిషం పాటు మరిగించుకొని దింపేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే నోరూరించే "ఉడుపి స్టైల్ మిరియాల రసం" రెడీ!

చలికాలం ఇలా "వాము చారు" చేసుకోండి - జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలు ఔట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.