ETV Bharat / state

తాగినోళ్లు సైలెంట్​గా ఇంటికెళ్లక - ఇవేం పనులురా నాయనా - DRUNK PEOPLE ARRESTED IN PEDDAPALLI

మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ముగ్గురు యువకులు - సీసీ కెమెరాలు, ఆటో అద్దాలు ధ్వంసం - అరెస్ట్​ చేసిన పోలీసులు

People Arrested in Peddapalli
Three Drunk People Arrested in Peddapalli (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2025, 1:22 PM IST

Updated : Jan 7, 2025, 2:05 PM IST

Three Drunk People Arrested in Peddapalli : పెద్దపల్లి జిల్లాలో మందుబాబులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. పుట్టిన రోజు సంబురాలతో రాత్రి 12 గంటల సమయంలో టపాసులు పేల్చి, కేకలు పెడుతున్నారు. దీంతో అక్కడ నివసిస్తున్న వారు ఇబ్బందిపడుతున్నారు. అంతటితో ఆగకుండా మద్యం తాగి రోడ్లపై వాహనాలపై తిరుగుతూ స్టంట్లు చేస్తున్నారు. పక్కనే ఉన్న వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. వీటిపై పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా వారు మాత్రం వారి పంథా మార్చుకోవడం లేదు. ఇలాంటి వారిపై స్థానికులు ఫిర్యాదు చేయాలన్నా ఎక్కడ గొడవకు దిగుతారో అని భయపడుతున్నారు.

మద్యం మత్తులో వీరంగం : తాజాగా మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ముగ్గురు యువకులను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ ​టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక హనుమాన్​ నగర్​కు చెందిన విశ్వతేజ, అరుణ్ కుమార్, సాయితేజ మద్యం సేవించి బర్త్​డే సంబురాలు చేసుకున్నారు. అక్కడ ఫుల్​గా మద్యం తాగి మత్తులో ఓ ఇంటికి సంబంధించిన సీసీటీవీ కెమెరాలతో పాటు అక్కడే ఉన్న ఆటో అద్దాలను ధ్వంసం చేశారు.

పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి : దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆటో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐ ఇంద్రాసేనా రెడ్డి హెచ్చరించారు. మద్యం మత్తులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు.

దంపతులను బలి తీసుకున్న యువకుడి మద్యం మత్తు - అనాథలుగా మారిన ఆడపిల్లలు

తప్పతాగి బస్‌స్టాండ్‌లో యువకుల హల్‌చల్‌ - పోలీసులు భలే పనిష్మెంట్‌ ఇచ్చారుగా!! - Police punishment To Youth

Last Updated : Jan 7, 2025, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.