Telangana Govt Alert On HMPV virus Cases : చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యూమో వైరస్) మహమ్మారి పొరుగు రాష్ట్రాలలో కొందరి చిన్నారుల్లో గుర్తించారు. శీతాకాలంలో చిన్నపిల్లలు, వృద్ధులలో చలి, జలుబు వంటి లక్షణాలను కలిగించే సాధారణ శ్వాస సంబంధిత వైరస్‌గా డాక్టర్లు చెబుతున్నారు. కరోనా అంతటి ప్రమాదకరమైందని కాదని, జాగ్రత్తలను పాటిస్తే దరచేరదని వైద్యాధికారులు అంటున్నారు. ఈ వైరస్ వచ్చిన ఐదేళ్ల లోపు పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం, న్యుమోనియా లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. రోగ నిరోధక శక్తి తగ్గకుండా చిన్నపిల్లలు, వృద్ధులు పోషహకారం తీసుకోని తగిన జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్‌తో ప్రమాదం ఉండదని చెబుతున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి రోజుకు 50 మంది వరకు వస్తారు. చలికాలం కావడంతో ఇప్పుడు 65మంది వరకు వస్తున్నట్లు వైద్యాధికారిణి డా.మాలిక చెప్పారు. చైనాలో హెచ్ఎంపీవీ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేశామని, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మూడు రోజుల పాటు జ్వరం, దగ్గు, జలుబు తగ్గకుండే వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు వివరించారు.
పెరుగుతున్న జలుబు, దగ్గు కేసులు : పరకాల సివిల్ ఆస్పత్రికి దగ్గు, జలుబు లక్షణాలతో వస్తున్న వారి సంఖ్య గత పది రోజులుగా పెరుగుతోంది. మంగళవారం 160 రోగులు వచ్చారు. ఇవి సాధారణ జబ్బులేనని చైనాలో విజృంభిస్తున్న వైరస్ కాదని వైద్యాధికారి డా.బాలకృష్ణ స్పష్టం చేశారు. ఆసుపత్రిలో మందుల కొరత లేదని తెలిపారు. ఎక్కువ సమస్యతో బాధపడుతున్న వారిని ఆసుపత్రిలోనే చేర్చుకొని వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు.
'పిల్లల్లోనే HMPV ప్రభావం ఎక్కువ'- ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని సలహా!
కమలాపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్న వారిలో జలుబు, దగ్గు, జ్వరం, ఆస్తమా లక్షణాలున్నవారు రోజుకి 35 -40 మంది వస్తున్నవారు వైద్యాధికారి డా.భానుచందర్ చెప్పారు. సీహెచ్‌సీలో అన్ని మందులు ఉన్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.నరేశ్ తెలిపారు. ములుకనూర్ పబ్లిక్ హెల్త్ సెంటర్లో రోజుకు పది మందికిపైగా జలుబు, దగ్గుతో వస్తున్నారని వైద్యాధికారి ప్రదీప్‌రెడ్డి చెప్పారు. ‘హ్యూమన్ మెటాన్యుమో వైరస్’ గురించి రోగులు భయపడాల్సిన పని లేదని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్ పీహెచ్‌సీలో అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారి తెలిపారు. చల్లని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
వైరస్ బారినపడకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలే సీనియర్ జనరల్ ఫిజీషియన్ డా. అజిత్ అహ్మద్ తెలిపారు.
- దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు నోరు, ముక్కును రుమాలు లేదా టిష్యూ పేపర్ అడ్డుపెట్టుకోవాలి.
- గుంపులతో కూడిన ప్రదేశాల్లో తిరగకూడదు
- ప్లూ ప్రభావిత వ్యక్తుల దగ్గరికి వెళ్లకూడదు.
- ఎక్కువగా నీరు తాగాలి. పోషకాహారం తీసుకోవాలి.
- చేతులను తరచూ శుభ్రం చేస్తుండాలి
- ఆందోళన, భయం వీడాలి. వైద్యుడి సలహాతో మాత్రమే చికిత్స పొందాలి.
HMPV కేసులపై ప్రభుత్వం అప్రమత్తం - అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జాగ్రత్తలు!
కరోనాలా HMPV ప్రమాదకరంగా మారుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?