Tollywood Heroines as Producers : ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు యాక్టింగ్ సైడ్ ఉంటూనే నిర్మాతగా మారిన వారు ఉన్నారు. అప్పటి హీరోయిన్లు విజయనిర్మల, భానుమతిలతో సహా ఇప్పటి తరంలోని చాలా మంది కథానాయికలు ప్రొడ్యూసర్లుగా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. వారెవరో తెలుసుకుందాం.
నిత్యామేనన్ : కామెడీ, రొమాంటిక్, యాక్షన్ అన్ని కేటగిరీ సినిమాల్లో కనిపించి మెప్పించిన నిత్యా మేనన్ స్కైల్యాబ్ చిత్రంతో నిర్మాతగా తొలి అడుగువేసింది. ఇందులో ఆమె ఒక లీడ్ రోల్ కూడా చేసింది.
అమలాపాల్ : ఫోరెన్సిక్ థ్రిల్లర్ కడవర్తో ప్రొడ్యూసర్ అయిన అమలాపాల్ గబగబా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోంది. అమలాపాల్ ప్రొడక్షన్స్ పేరిట అడాయ్, అధో అంధా పరవాయి పోలాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా పిట్ట కథలు అనే వెబ్ సిరీస్ కూడా నిర్మించి అందులో లీడ్ రోల్లో మీరా పాత్ర పోషించింది అమలా.
నిహారిక కొణిదెల : సినిమా అంటే ప్రాణమని ఆరేళ్లుగా పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్స్ పేరిట బ్యానర్ స్టార్ట్ చేసి ముద్ద పప్పు ఆవకాయ్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ లాంటి హిట్ ప్రొజెక్టులను ప్రేక్షకుల ముందుకుతెచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై మంచి హిట్ రాకపోవడంతో మళ్లీ టీవీషోలు, వెబ్ సిరీస్‌ల మీదనే ఫోకస్ పెట్టింది.
నయనతార : లేడీ సూపర్ స్టార్ నయనతార రౌడీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌తో కలిసి కో ప్రొడ్యూసర్‌గా మారారు. ఆమె పార్టనర్‌షిప్ పెట్టుకుంది ఎవరితోనే కాదు లైఫ్ పార్టనర్ విగ్నేష్ శివన్ తోనే.
నజ్రియా నజీమ్ : ఫహద్ ఫాజిల్ భార్య, మలయాళ నటి అయిన నజ్రియా, అదేనండీ, రాజా రాణి, బెంగళూరు డేస్ హీరోయిన్. తన పేరు మీదనే నజ్రియా నజీమ్ ప్రొడక్షన్స్ అని బ్యానర్ స్టార్ట్ చేసి చక్కటి కథాంశంతో ఉన్న సినిమాలు తెరకెక్కిస్తోంది.
ఛార్మీ కౌర్ : 2002లో నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఛార్మీ తన కెరీర్లో చాలా ఒడిదొడుకులను ఎదుర్కొంది. అయితే ఆమె తన ఫ్రెండ్ పూరీ జగన్నాథ్‌తో కలిసి కో ప్రొడ్యూసర్‌గా సినిమాలు తీస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్, లైగర్ వంటి సినిమాలు తీశారు.