Tollywood Heroine Action Movies : సాధారణంగా హీరోలు ఇచ్చే ప్రేమ గులాబీలు తీసుకుంటూ, వాళ్లతో కలిసి చిందులేస్తూ గ్లామర్ ఒలకబోసే హీరోయిన్స్ ఇప్పుడు తమలోని మరో కోణాన్ని బయటపడుతున్నారు. గతంలో అడపాదడపాగా తుపాకీ పట్టి యాక్షన్ తూటాలు పేల్చే భామలు ఇప్పుడు అదే పని పెట్టుకున్నారు. బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపించేందుకు రెడీ అయిపోయారు. మరి రివాల్వర్ రాణీల్లా తెరపై రానున్న భామలెవరు? ఏ సినిమాలతో రానున్నారో తెలుసుకుందాం.
హీరోయిన్ సమంత ఈ మధ్య ఎక్కువగా యాక్షన్ పాత్రలతోనే కనిపిస్తోంది. యశోద, ది ఫ్యామిలీమ్యాన్ 2 కోసం తుపాకీ పట్టిన ఈమె ఇప్పుడు మా ఇంటి బంగారం కోసం డబుల్‌బ్యారెల్ గన్‌ను పట్టుకుంది. ఇది సామ్ సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌పై నిర్మితమవుతోంది. రీసెంట్‌గానే అఫీషియల్‌గా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఇందులో గన్ పట్టుకున్న గృహిణిగా సామ్ ఆకట్టుకుంది. మలయాళ నుంచి కొత్త దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నారు. అలానే త్వరలోనే సిటాడెల్: హనీ బన్నీ వెబ్‌సిరీస్‌తో ఓటీటీలో సందడి చేయనుంది. ఇందులో కూడా ఆమె యాక్షన్ రోలే.
వైవిధ్యభరితమైన లేడీ ఓరియెంటెడ్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఆడియెన్స్‌ను మెప్పిస్తున్న కీర్తి సురేశ్ రీసెంట్గా సైరెన్ కోసం పోలీసు ఆఫీసర్‌గా కనిపించింది. ఇప్పుడామె రివాల్వర్ రీటా(keerthi Suresh Revolver Reeta) కోసం మరోసారి గన్స్ పట్టుకోనుంది. కె.చంద్రు దర్శకత్వం వహించారు. టిల్లు స్క్వేర్‌లో స్పైగా లిల్లీ పాత్రలో యాక్షన్ చేసింది అనుపమ. విలన్ గ్యాంగ్‌పై కాసేపు విరుచుకుపడుతూ ఆకట్టుకుంది. ఇక సత్యభామ(Kajol Agarwal Sathyabamha Movie) చిత్రంలో పోలీసుగా గన్‌పట్టి బాక్సాఫీస్ ముందుకు రానుంది కాజల్ అగర్వాల్. సుమన్ చిక్కాల దర్శకుడు. ఈ సినిమా మే 17న థియేటర్లలోకి రానుంది. క్రాక్ చిత్రంలో కాసేపు యాక్షన్ పాత్రలో కనిపించి ఫ్యాన్స్‌ను అలరించింది శ్రుతిహాసన్. ఇప్పుడామె అడివి శేష్‌తో కలిసి డెకాయిట్‌లో(Shrutihassan Dacoit Movie) నటిస్తోంది. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం అందింది.
కొత్త బాహుబలి వచ్చేస్తోంది - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన జక్కన్న - RAJAMOULI BAAHUBALI
రాశీ ఖన్నా అందాల జాతర - ఇది మరో రేంజ్ అంతే! - Raasi Khanna Latest Photoshoot