ETV Bharat / bharat

ఒక్క పూటలో కోటిన్నర మంది 'అమృత్​' స్నానం!- మహాకుంభ్​లో అడుగడుగునా ఆధ్యాత్మిక శోభ - MAHA KUMBH MELA MAKAR SANKRANTI

ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమానికి రెండో రోజూ పోటెత్తిన భక్తులు - మంగళవారం అఖాడాల అమృత్ స్నానం- ఒక్కపూటలో కోటీ 38 లక్షల మందికిపైగా పవిత్ర స్నానాలు

Maha Kumbh Mela 2025 Makar Sankranti
Maha Kumbh Mela 2025 Makar Sankranti (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2025, 2:24 PM IST

Maha Kumbh Mela 2025 Makar Sankranti : ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమానికి రెండో రోజూ భక్తులు పోటెత్తుతున్నారు. మకర సంక్రాంతి పుణ్యదినం సందర్భంగా మంగళవారం లక్షలాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తొలిరోజే కోటీ 65 లక్షల మంది పుణ్యస్నానాలు చేయగా నేడు అఖాడాలు అమృత్ స్నాన్‌ ఆచరిస్తున్నారు. 10వేల ఎకరాల కుంభనగర్‌ ఇసుకేస్తే రాలనంతగా నిండిపోయింది. స్నాన్‌ ఘాట్‌లన్నీ కిక్కిరిసిపోయాయి. ఉదయం 10గంటలకే కోటీ 38 లక్షల మందికిపైగా అమృత్ స్నానాలు చేసినట్లు కుంభమేళా అధికారులు ప్రకటించారు.

Maha Kumbh Mela 2025 Makar Sankranti
త్రివేణి సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు (ETV Bharat)

మకర సంక్రాంతి అమృత్ స్నాన్
ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళా రెండో రోజూ వైభవంగా సాగుతోంది. లక్షలాదిగా వస్తున్న భక్తులతో గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతం జన సంద్రంలా మారిపోయింది. దేశవిదేశాల నుంచి భక్తులు, సాధువులు తరలిస్తున్నారు. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా అఖాడాలు 'అమృత్ స్నాన్' చేశారు. వేకువజామున 3 గంటలకు బ్రహ్మముహూర్తంలో అమృత్ స్నానాలు ప్రారంభమయ్యాయి. శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణి, శ్రీశంభు పంచాయతీ అటల్ అఖాడా, నిరంజని అఖాడా, ఆనంద్ అఖాడా మకర సంక్రాంతి వేళ తొలి 'అమృత్ స్నాన్' ఆచరించారు.

Maha Kumbh Mela 2025 Makar Sankranti
ఉత్సాహంగా నదిలో స్నానం చేస్తున్న సాధువులు (ETV Bharat)

13 అఖాడాలకు పక్కా ప్రణాళిక
వివిధ వర్గాలకు చెందిన 13 అఖాడాలు మహాకుంభమేళాలో పాల్గొంటున్నాయి. అఖాడాల్లో ఎవరు ఎప్పుడు పుణ్య స్నానాలు చేయాలో వరుస క్రమంలో మహాకుంభ్ మేళానిర్వహణ యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. మకర సంక్రాంతి, వసంత పంచమి రోజున సనాతన ధర్మానికి చెందిన 13 అఖాడాలు 'అమృత్ స్నాన్' చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ప్రభుత్వం వివరించింది. ఈ నేపథ్యంలో అఖాడాలు తమ బృందాలతో ర్యాలీగా తరలివచ్చారు. భక్తులకు వేరుగా, అఖాడాలకు వేరుగా స్నాన్‌ ఘాట్‌లను మహాకుంభమేళా అధికారులు ఏర్పాటు చేశారు.

Maha Kumbh Mela 2025 Makar Sankranti
కుంభమేళాకు తరలివస్తున్న కళాకారులు, సాధువులు, ఆధ్యాత్మిక గురువులు (ETV Bharat)

144 ఏళ్లకోసారి వచ్చే ముహూర్తం!
సాధారణంగా 12 ఏళ్లకోసారి మహాకుంభమేళా జరుగుతుంది. కానీ గ్రహాల సంచారం ఆధారంగా గణిస్తే ప్రస్తుత కుంభమేళా 144 ఏళ్లకోసారి వచ్చే అరుదైన ముహూర్తంలో జరుగుతున్నట్లు సాధువులు చెబుతున్నారు. 'పుష్య పౌర్ణిమ' సందర్భంగా సోమవారం ప్రధాన 'స్నానం' అంచరించగా మకర సంక్రాంతి రోజు చేసేది అమృత్ స్నానమని చెప్పారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు, సాధువులు, ప్రజలు ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తమ పాపాలన్నీ సమసిపోతాయనే విశ్వాసంతో భక్తులు, సాధువులు తరలివచ్చి స్నానాలు చేస్తున్నారు. గడ్డకట్టించేత చల్లగా నీరు ఉన్నప్పటికీ భక్తులు గుంపులుగా వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 'హర్ హర్ మహాదేవ్', 'జై శ్రీరామ్', 'జైగంగామయ్యా' అని నినదిస్తూ స్నానాలు చేస్తున్నారు.

Maha Kumbh Mela 2025 Makar Sankranti
త్రివేణి సంగమంలో ఉత్సాహంగా నదిలో స్నానం చేస్తున్న యువతి (ETV Bharat)
Maha Kumbh Mela 2025 Makar Sankranti
నదిలో పుణ్య స్నానమాచరిస్తున్న విదేశీ మహిళ (ETV Bharat)

'కోటిన్నర మందికి పైగా'
మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి కోటి 60లక్షలమందికిపైగా భక్తులు అమృత్ స్నానాలు ఆచరించినట్లు మహాకుంభమేళా అధికారులు ప్రకటించారు. అమృత్ స్నాన్ చాలా శాంతియుతంగా జరుగుతోందని ఉత్తర్‌ ప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. తమ అధికారులు, జవాన్లు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఈసారి భద్రత కోసం సీసీటీవీలు, డ్రోన్లు, అండర్ వాటర్ డ్రోన్లు ఉపయోగిస్తున్నామని వెల్లడించారు.

Maha Kumbh Mela 2025 Makar Sankranti
గంగా మాతకు పూజ చేస్తున్న మహిళ (ETV Bharat)

'ఇది శాశ్వతమైన సంస్కృతి'
కుంభమేళాకు వస్తున్న భక్తులు, సాధువులకు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇది మన శాశ్వతమైన సంస్కృతి, విశ్వాసానికి సజీవ రూపం అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 'మకర సంక్రాంతి' శుభసందర్భంగా, ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగంలో మొదటి 'అమృత్ స్నాన్' చేయడం ద్వారా పుణ్యఫలం సంపాదించుకున్న భక్తులకు అభినందనలు అని పోస్ట్ చేశారు. తొలిరోజు కోటీ 75 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం తెలిపారు.

Maha Kumbh Mela 2025 Makar Sankranti
మహదేవ్​కు నమస్కరిస్తున్న భక్తుడు (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.