తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఈ టాలీవుడ్ డైరెక్టర్ల సతీమణులను ఎప్పుడైనా చూశారా ? - టాలీవుడ్ డైరెక్టర్ల ఫ్యామిలీ ఫొటోస్

Tollywood Directors With Their Wives : టాలీవుడ్​లో ఎంతో మంది డైరెక్టర్లు రాణిస్తున్నారు. అయితే వారి గురించి మనకు అంతగా తెలియకపోవచ్చు. ముఖ్యంగా వాళ్ల ఫ్యామిలీ గురించి అతితక్కువగానే తెలుసుంటుంది. ఈ నేపథ్యంలో మన తెలుగు డైరెక్టర్ల సతీమణులను ఓ సారి చూద్దామా.

Tollywood Directors With Their Wives
Tollywood Directors With Their Wives

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 1:44 PM IST

Tollywood Directors With Their Wives : ప్రతి పురుషుడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందన్న మాటను ఎంతో మంది నిరూపించారు. అందులో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే మన టాలీవుడ్​లో విజయవంతంగా దూసుకుపోతున్న హీరోల గురించి అలాగే వారి భార్యల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ హీరోలకు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చే డైరెక్టర్ల ఫ్యామిలీల గురించి చాలా మందికి తక్కువ తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే చాలా మంది డైరెక్టర్ల ఫ్యామిలీలను ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. అలా టాలీవుడ్ లో ఉన్న క్రేజీ డైరెక్టర్లు, వారి భార్యల గురించి ఓ లుక్కేద్దాం రండి.

రమా రాజమౌళి :
రాజమౌళి రమా రాజజమౌళి దంపతుల గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ జంట అందరికీ తెలిసిందే. జక్కన్న డైరెక్టర్​గా ఉంటే రమా ఆయన ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటారు. సినిమాకు సంబంధించిన పలు బాధ్యతలు, హీరోల మేకప్, డ్రెస్సింగ్ విషయాలన్నింటీని ఆమె చూసుకుంటుంటారు

తబిత సుకుమార్:
టాలీవుడ్ పాపులర్ డైరెక్టర్లలో లెక్కల మాస్టర్ సుకుమార్ ఒకరు. ఆయన భార్య గురించి చాలా మందికి తెలియదు.ఆమె ఓ ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నారు. భర్తకు సినిమాల్లో చేదోడువాదోడుగా ఉంటారు.

భార్గవి అనిల్ రావిపూడి:
అనిల్ రావిపూడి భార్య భార్గవి గురించి కూడా సినీ ప్రియులకు పెద్దగా తెలియదు. ఆమె ఓ గృహిణి. ఈ జంటకు ఓ బాబు కూడా ఉన్నాడు.

మాలిని వంశీ పైడిపల్లి :
టాలీవుడ్​కు ఎన్నో సాలిడ్ హిట్స్ అందించిన వంశీ పైడిపల్లి సతీమణి పేరు మాలిని. ఆమె అప్పుడప్పుడు తన భర్తతో కలిసి సినిమా షూటింగుల్లో పాల్గొంటుంటారు. వీరికి ఓ కుమార్తె ఉంది.

త్రివిక్రమ్ సాయి సౌజన్య:
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య స్వతహాగా ఓ డ్యాన్సర్​. ఆమె శాస్త్రీయ నృత్యంలో పలు స్టేజీ షోలు కూడా చేశారు. అంతే కాకుండా ఆమె నిర్మతగా కూడా రాణిస్తున్నారు.

లక్ష్మీ వినాయక్ :
మాస్ అండ్ ఎంటర్​టైనింగ్ సినిమాలను తెరకెక్కించడంలో వి.వి వినాయక్ దిట్ట. ఆయన సతీమణి పేరు లక్ష్మీ.

అనూష :
తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్​ కేఎస్ రవి అలియాస్ బాబీ పేరు అందరికీ తెలిసిందే. ఇక బాబీ సతీమణి పేరు అనూష. వీరిది ప్రేమ వివాహం. చెస్ ఛాంపియన్ ద్రోణవల్లి హారికకు అనూష సోదరి.

విలేఖ :
మాస్ సినిమాలను తెరకెక్కించడంలో పేరున్న వ్యక్తుల్లో డైరెక్టర్​ బోయపాటి శ్రీను ఒకరు. ఆయన సతీమణి పేరు విలేఖ. ఈమె కూడా బోయపాటికి అప్పుడప్పుడు వర్క్​లో చేదోడుగా ఉంటారు.

లత :
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సతీమణి లత కూడా ప్రస్తుతం సినీఇండస్ట్రీలో ఉన్నారు.

రూప :
టాలీవుడ్​లోని సక్సెస్ డైరెక్టర్లో శ్రీనువైట్ల ఒకరు. ఈయన భార్య పేరు రూప.

లావణ్య :
పూరి జగన్నాథ్ సతీమణి పేరు లావణ్య. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు ఆకాష్ పూరి ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నారు. ఇక కుమార్తె కూడా సినిమాల్లో యాక్ట్ చేశారు.

సత్య :
టాలీవుడ్ టాప్ డైరెక్టర్​లలో గోపీచంద్ మలినేని కూడా ఒకరు. ఆయన భార్య పేరు సత్య. వీరి కొడుకు ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్​గా సినిమాల్లో నటిస్తున్నాడు.

స్పందన:
డైరెక్టర్ మారుతీ సతీమణి పేరు స్పందన. వీరిద్దరూ కలిసి అప్పుడప్పుడు బుల్లితెరపై షోలలో సందడి చేస్తుంటారు.

సుకుమార్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా? - వైరల్​గా కూతురు బర్త్ డే ఫోటోస్

యూట్యూబ్​ ఛానెల్​ ప్రారంభించిన మహేశ్​ కూతురు

ABOUT THE AUTHOR

...view details