Tollywood Boxoffice Tamil Movies : కథ, కథనం బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల సినిమాలను తెలుగు ఆడియెన్స్ ఎంతలా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు ఇతర భాషల డబ్బింగ్ సినిమాలు వచ్చి సందడి చేస్తుంటాయి.
అయితే ఈ ఏడాది రానున్న రోజుల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు తమిళ సినిమాల హవా ఎక్కువ కనపడనుంది. ఇప్పటికే తమిళ హీరోల చిత్రాలకు తెలుగులో మంచి మార్కెట్, డిమాండ్ ఉంది. ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, విక్రమ్, కార్తీ, ధనుశ్ నటించే సినిమాలు తెలుగులో మంచి కలెక్షన్లను అందుకుంటాయి.
రీసెంట్‌గానే కమల్ హాసన్ భారతీయుడు -2తో(Kamalhassan Indian 2) విడుదలైంది. మంచి థియేట్రికల్ బిజినెస్ కూడా చేసుకుంది. కాకపోతే టాక్ బాలేక వసూళ్ల విషయంలో ఫెయిల్ అయింది. ఇప్పుడు మరిన్ని చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న విక్రమ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ మూవీ తంగలాన్(Vikram Thangalaan) విడుదల కానుంది. విలక్షణ హీరో ధనుశ్ ‘రాయన్ ఆగస్టు 27న బాక్సాఫీస్ ముందుకు రానుంది.
మరో స్టార్ హీరో సూర్య నటించిన భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామ్ కంగువ(Suriya Kanguva Movie) దసరా కానుకగా భారీ స్థాయిలోనే విడుదల కానుంది.