Tillu Square Anupama Parameshwaran : ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఐపీఎల్ హడావుడితో పాటు హీరోయిన్ అనుపమ గురించే ఫుల్ ట్రెండింగ్ అవుతోంది. ఎందుకంటే అనుపమ నటించిన బోల్డ్ కంటెంట్ మూవీ డీజే టిల్లు స్క్వేర్ మరో రోజులో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఇప్పటికే ఆమె తన బోల్డ్ లుక్స్‌తో క్యారెక్టర్‌తో యూత్‌ను బాగా కవ్వించేసింది. సినిమాలో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయింది. దీంతో ఆమె విమర్శలను, నెగటివ్ కామెంట్లను బాగా ఎదుర్కొంటోంది. ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు చేస్తే బోర్ కొడుతుంది కదా? హీరోయిన్ అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి, అది తన బాధ్యత అంటూ అప్పటికీ అనుపమ ఫ్యాన్స్‌కు సర్దిచెప్పే ప్రయత్నాలు చేసింది. కానీ చాలా మంది అస్సలు ఊరుకోవట్లేదు. ట్రోలింగ్ ఫుల్‌గా చేస్తునే ఉన్నారు. అయితే అవి ఇప్పుడు బాగా శ్రుతిమించేశాయి. దీంతో వీటిపై హీరో సిద్ధు జొన్నల్లగడ్డ కాస్త సీరియస్ అయ్యారు.
ఇబ్బంది పెట్టొద్దు : బుధవారం (మార్చి 27న) టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గానే జరిగింది. ఈ ఈవెంట్‌కు అనుపమ హ్యాండిచ్చింది. అయితే అనుపమ ఎందుకు హ్యాండ్ ఇచ్చిందో స్టేజీపైనే ఇండైరెక్ట్‌గా స్పందించాడు సిద్దు జొన్నలగడ్డ. "టిల్లు స్క్వేర్ మూవీ నుంచి ఈ మధ్య లేటెస్ట్గా ఓ స్పెషల్ పోస్టర్ విడుదలైంది. ఆ పోస్టర్‌కు చాలా కామెంట్స్ చేశారు. ఒక అమ్మాయి గురించి ఏది పడితే అది అనడం సరికాదు. మీకు మాట్లాడే రైట్ ఉంది. దాన్ని నేను తప్పు అని అనడం లేదు. మనం ఒకరిని ఫ్లర్ట్ చేస్తే అది అవతలి వాళ్లకు ఎంజాయ్ చేసేలానే ఉండాలి. కానీ వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు" అని అన్నారు.