ETV Bharat / entertainment

'డాకు మహారాజ్' నెక్ట్స్ లెవెల్ ప్రమోషన్స్- అమెరికాలో గ్రాండ్ ఈవెంట్- ఎప్పుడంటే? - DAAKU MAHARAAJ EVENT

అమెరికాలో డాకు మహారాజ్ ఈవెంట్- నేషనల్ కాదు ఇకపై బాలయ్య ఇంటర్నేషనల్ హీరో!

Daaku Maharaaj Event
Daaku Maharaaj Event (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2024, 10:34 PM IST

Daaku Maharaaj Event : నందమూరి నటసింహం బాలకృష్ణ- స్టార్ డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్'. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2025 సంక్రాంతి సందర్భంగా జవవరి 12న థియేటర్లలో గ్రాండ్​గా విడుదల కానుంది. ఈ శనివారం మూవీ రిలీజ్ కౌంట్ డౌన్ ప్రారంభించారు. మరో 50 రోజుల్లో డాకు మహారాజ్ థియేటర్లలో సందడి చేయనున్నాడంటూ మేకర్స్​ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.

అయితే ఈ సినిమాను మేకర్స్​ భారీ స్థాయిలో ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో అప్డేట్​తో బాలయ్య ఫ్యాన్స్​లో ఫుల్ జోష్ నింపారు. అమెరికాలో 'డాకు మహారాజ్' ఈవెంట్​ గ్రాండ్​గా చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అమెరికాలోని డల్లాస్​ నగరంలో ఈ ఈవెంట్​కు ప్లాన్ చేశారు. 2025 జనవరి 4న సాయంత్రం 6 గంటలకు ప్రోగ్రామ్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రీలీజ్ చేశారు. 'డల్లాస్ డాకు మహారాజ్ జోన్ కాబోతుంది. హలో USA గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బలకృష్ణకు స్వాగతం పలుకడానికి సిద్ధంగా ఉండండి' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్​లో ప్రమోట్ చేయడం పట్ల బాలయ్య ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు.

కాగా, మేకర్స్​ ఇటీవల సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఈ మాస్ టీజర్​కు మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిచగా, సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్​పై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

డాకు అంటే అర్థమిదే - డాకు మహరాజ్​ అనే టైటిల్​ను అనౌన్స్​ చేశాక చాలా మంది డాకు అంటే అర్థం ఏమిటా అని వెతుకుతున్నారు. డాకు అనేది హిందీ పదం. డాకు అంటే బందిపోటు, దొంగ అని అర్థం. అందుకు తగ్గట్టే సినిమాలో బాలయ్య ప్రచార చిత్రంలో బందిపోటు గెటప్​లో కనిపించారు!

NBK 109 టైటిల్ రివీల్ - 'డాకు మహారాజ్'గా బాలయ్య!

'డూప్​లు లేవు, డూప్లికేట్​లు లేవు - గుర్రం ఎక్కింది, నడిపింది బాలయ్యనే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.