ETV Bharat / entertainment

షూటింగ్ 35 శాతం కంప్లీట్ అయ్యింది - సీక్వెల్​లో ఆమె రోల్​ కూడా ఉంది : 'కల్కి 2' ప్రొడ్యూసర్లు - KALKI 2898 AD SEQUEL

'కల్కి 2898 AD' సీక్వెల్​ - కీలక అప్​డేట్ షేర్ చేసిన మేకర్స్!

Kalki 2898 AD Sequel
Prabhas Kalki 2898 AD Sequel (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2024, 12:43 PM IST

Kalki 2898 AD Sequel : రెబల్​ స్టార్ ప్రభాస్‌ లీడ్ రోల్​లో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ మూవీ 'కల్కి 2898 ఏడీ'. భారీ తారాగణంతో, అంతకుమించి బడ్జెట్​తో రూపొందిన ఈ చిత్రం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్​లోనూ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'కల్కి 2' తెరకెక్కనుంది. గతంలోనే మేకర్స్ ఈ విషయం అఫీషియల్​గా వెల్లడించగా, నెమ్మదిగా ఈ సినిమా గురించి అప్పుడప్పుడు అప్​డేట్​లను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు. తాజాగా గోవాలో జరుగుతోన్న 'ఇఫ్ఫీ' వేడుకల్లో 'కల్కి' చిత్ర నిర్మాతలు స్వప్న- ప్రియాంక ఈ సినిమా షూటింగ్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

"ప్రస్తుతం 'కల్కి' పార్ట్‌ 2కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అయితే రెగ్యులర్‌ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్​ చేయాలన్న విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అన్ని సెట్ అయ్యాక అనౌన్స్ చేస్తాం. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకొణె పార్ట్‌ 2లోనూ కొన్ని సీన్స్​లో అమ్మ పాత్రలో కనిపించనున్నారు" అని వెల్లడించారు.

'కల్కి 2898 ఏడీ'తో పాటే సీక్వెల్‌కు సంబంధించిన షూట్‌ను కొంతవరకూ తీసినట్లు చెప్పారు. ఇక పార్ట్‌ 2కు సంబంధించి 35 శాతం షూట్‌ జరిగిందని తెలిపారు. గోవాలో జరుగుతోన్న 'ఇఫ్ఫి' వేడుకల్లో పాల్గొనడం తమకు చాలా ఆనందం కలిగిస్తోందని అన్నారు. తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా లభిస్తోన్న ఆదరణ చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు.

ఇక 'కల్కి' విషయానికి వస్తే, వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆడియన్స్‌ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ సినిమాలో బిగ్​బీ అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామగా ఆకట్టుకోగా, కోలీవుడ్ స్టార్ హీరో కమల్‌ హాసన్‌ సుప్రీం యాస్కిన్‌గా మెరిశారు. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్ ఠాకూర్​, విజయ్‌ దేవరకొండ, రాజమౌళి లాంటి స్టార్స్ అతిథి పాత్రల్లో మెరిశారు. బౌంటీ ఫైటర్‌ భైరవగా ప్రభాస్ సందడి చేయగా, సినిమా చివర్లో కర్ణుడిగా కనిపించి పార్ట్‌ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. ఇక దీపికా కూడా తన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఆ బాలీవుడ్​ హీరోయిన్​తో సినిమా - అసలు విషయం బయటపెట్టిన 'కల్కి' నాగ్ అశ్విన్!

రాజమౌళితో సినిమా చేయాలని ఉంది : 'కల్కి' మూవీ ప్రొడ్యూసర్ - Ashwini Dutt Rajamouli Movie

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.