Thriller Movies In OTT :ఎలాంటి రక్తపాతం లేకపోయినా, క్రూరమైన మర్డర్లు లేకపోయినా కళ్లు అప్పగించి చూసేలా చేస్తుంటాయి కొన్ని థ్రిల్లర్ సినిమాలు. కథలో పలు ఊహించని మలుపులు కూడా కూర్చున్న చోటు నుంచి లేవకుండా చేస్తాయి. మనకు తెలియకుండానే మనలో ఒక టెన్షన్, భయం మొదలవుతాయి. అందుకే థ్రిల్లర్ సినిమాలకు ఓ ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. పైగా బాలీవుడ్ థ్రిల్లర్ సినిమాల స్టైల్ సపరేట్ ఉంటుంది. అందుకే మీకోసం ఆ లిస్ట్ మీ ముందుకు.
సంఘర్ష్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
ప్రొఫెసర్, సైకో, ఇన్వెస్టిగేటర్ ఈ మూడు ప్రధాన పాత్రలతో నడిచే కథ. విడుదలైన వెంటనే మంచి టాక్ తెచ్చుకోకపోయినా నిదానంగా క్లిక్ అయింది.
దృశ్యం (అమెజాన్ ప్రైమ్ వీడియో)
మలయాళీ ఒరిజినల్ సినిమా రీమేక్ ఈ దృశ్యం. బాక్సాఫీసు వద్ద కలక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఐజీ కొడుకుకు కనిపించకుండా పోవడం వెనుక ఓ ఆడపిల్ల తండ్రి హస్తం ఉందని పోలీసులు విచారిస్తుంటారు. అసలు కథ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
గుమ్నం (అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్)
ఒక కాంటెస్ట్‌లో గెలిచిన ఎనిమిది మంది వ్యక్తులు ఒక ఐలాండ్‌లో ఇరుక్కుపోతారు. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా రాజా నవతె దర్శకత్వం వహించి సినిమాను తెరకెక్కించారు. ఇది అప్పట్లో బాలీవుడ్‌కే ట్రేడ్ మార్క్‌గా నిలిచింది.
బద్లా (నెట్‌ఫ్లిక్స్)
స్పానిష్ ఫిల్మ్ "ద ఇన్విజిబుల్ గెస్ట్" ప్రేరణగా రూపొందించిన చిత్రం బద్లా. సినిమా రిలీజ్ అయి నాలుగు దశాబ్దాలు దాటినా ఇప్పటికి కూడా ఉత్కంఠభరితంగా అనిపిస్తుంది కథనం.
16 డిసెంబర్ (అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్)
మణిరత్నం డైరక్షన్‌లో మిలింద్ సోమన్ నటించిన సూపర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. టెర్రరిస్ట్ దాడులు, రాజకీయ నిర్ణయాలు సీక్రెట్ ఏజెన్సీపై ఎలాంటి ప్రభావం చూపించాయనేది కథాంశం.