తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఈ వారం థియేటర్లలో ఒక్కటే సినిమా - కానీ OTTలో మాత్రం బోలెడు! - This Week Theatre OTT Releases - THIS WEEK THEATRE OTT RELEASES

This Week Theatre OTT Releases : ఈ వారం థియేటర్లలో ఒకే ఒక్క సినిమా రానుంది. అదే కల్కి. అయితే ఇదే సమయంలో ఈ వారం ఓటీటీలో పలు ఆసక్తికరమైన చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు వస్తున్నాయి. అవేంటంటే?

source ETV Bharat and Getty Images
This Week Theatre OTT Releases (source ETV Bharat and Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 11:39 AM IST

This Week Theatre OTT Releases : ఈ వారం థియేటర్లలో కేవలం ఒకే ఒక్క సినిమా రాబోతుంది. అదే ప్రభాస్ కల్కి. అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, కమల్‌ హాసన్‌, దిశా పటానీ కలిసి నటించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. దీన్ని ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్​గా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించారు. కాశీ, కాంప్లెక్స్‌, శంబల అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే కథకు పురాణగాథ, పాత్రలను జత చేసి తీర్చిదిద్దారు. జూన్‌ 27న(Kalki 2898 AD Release Date) ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

అయితే ఇదే సమయంలో ఈ వారం ఓటీటీలో పలు ఆసక్తికరమైన చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు వస్తున్నాయి. నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన లవ్‌ రొమాంటిక్‌ మూవీ లవ్‌ మౌళి తెలుగు ఓటీటీ వేదికగా ఆహాలో జూన్‌ 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఫంకూరీ గిద్వానీ హీరోయిన్. రీసెంట్​గా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం యూత్​ను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది.

అమెజాన్‌ప్రైమ్​లో

  • శర్మాజీ కీ బేటీ (హిందీ) జూన్‌ 28
  • సివిల్‌వార్‌ (తెలుగు డబ్బింగ్‌) జూన్‌ 28

నెట్‌ఫ్లిక్స్‌లో

  • వరస్ట్‌ రూమ్మేట్‌ ఎవర్‌2 (వెబ్‌ సిరీస్‌) జూన్‌ 26
  • మై లేడీ జానీ (వెబ్‌సిరీస్) జూన్‌ 27
  • దట్‌ నైన్టీస్‌ (వెబ్‌సిరీస్‌2) జూన్‌ 27
  • సుపాసెల్‌ (వెబ్ సిరీస్‌) జూన్‌ 27
  • ది వర్ల్‌ విండ్‌ (కొరియన్‌ సిరీస్‌) జూన్‌ 28
  • ఓనింగ్‌ మాన్‌ హట్టన్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 28
  • ఎ ఫ్యామిలీ ఎఫైర్‌ (హాలీవుడ్) జూన్‌ 28

డిస్నీ+హాట్‌స్టార్​లో

  • ది బేర్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌27

జీ5లో

  • రౌతూ కా రాజ్‌ (హిందీ) జూన్‌ 28

ఆపిల్‌ టీవీ ప్లస్‌

  • ల్యాండ్‌ ఆఫ్‌ ఉమెన్‌ (హాలీవుడ్‌) జూన్‌ 26
  • ఫ్యాన్సీ డ్యాన్స్‌(హాలీవుడ్‌) జూన్‌28

ప్రభాస్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన అమితాబ్ - ఎందుకంటే?

అభిమానికి క్షమాపణలు చెప్పిన నాగార్జున - ఇంతకీ ఏం జరిగిందంటే?

ABOUT THE AUTHOR

...view details