This Week Theatre OTT Releases : ప్రభాస్ కల్కి 2898 ఏడీ భారీ సక్సెస్ తర్వాత వచ్చిన చిత్రాలేమీ అంతగా విజయాన్ని అందుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరిన్ని సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. జులై చివరి వారం అనగా ఈ వారం కొన్ని చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అలానే ఓటీటీలోనూ కొత్త చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్కు రెడీ అయ్యాయి. అవేంటంటే?
బ్రహ్మరాక్షసుడిలా వస్తాడు, దహనం చేస్తాడు(Raayan Release Date) - ధనుశ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాయన్ ఈ నెల 26న రిలీజ్ కానుంది. సందీప్ కిషన్, దుషారా విజయన్, అపర్ణ బాలమురళి, కాళిదాస్ జయరామ్ కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ నిర్మించింది. బ్రహ్మరాక్షసుడిలా వస్తాడు, దహనం చేస్తాడు అంటూ ప్రచార చిత్రాల్లో చూపించిన ఆయన పాత్ర సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. సినిమాలోవరలక్ష్మీ శరత్‌కుమార్, ప్రకాశ్‌రాజ్, సెల్వరాఘవన్, శరవణన్ కూడా నటించారు.
Operation Raavan release date : రక్షిత్ అట్లూరి హీరోగా వెంకట సత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆపరేషన్ రావణ్. సంకీర్తన విపిన్ హీరోయిన్. ధ్యాన్ అట్లూరి నిర్మాత. ఇది కూడా ఈ చిత్రం జులై 26న రిలీజ్ కానుంది.
Purushothamudu Release Date : రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పురుషోత్తముడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోంది. హాసిని సుధీర్ హీరోయిన్. రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ వారం ఓటీటీలో అలరించే సినిమా/సిరీస్‌లివే!
నెట్‌ఫ్లిక్స్‌లో
ది డెకామెరాన్ (వెబ్‌సిరీస్) జులై 25
డ్రాగన్ ప్రిన్స్ (వెబ్ సిరీస్) జులై 26
అమెజాన్ ప్రైమ్
ది మినిస్ట్రీ ఆఫ్ అన్ జెంటిల్మాన్లీ వార్ ఫేర్ (హాలీవుడ్) జులై 25
భయ్యాజీ (హిందీ) జులై 25