తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

OTTలోకి ఒక్కరోజే 6 సినిమాలు - ఆ 11 మంది అమ్మాయిలను చంపిన సీరియల్ కిల్లర్‌ మూవీ కూడా! - THIS WEEK OTT RELEASE MOVIES

వీకెండ్​ దగ్గర పడడంతో ఓటీటీలో ఈ ఒక్కరోజే తెలుగులో రిలీజైన 6 సినిమాలు!

This Week OTT Release Movies
This Week OTT Release Movies (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2024, 1:51 PM IST

This Week OTT Release Movies : వీకెండ్​ దగ్గర పడడంతో పలు ఓటీటీ సంస్థలు గురువారమే పలు ఆసక్తికర చిత్రాలను విడుదల చేశాయి. అలా ఈ ఒక్కరోజే ఏకంగా 6 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అవన్నీ తెలుగులోనే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏకంగా మూడు చిత్రాలు ఒకే ఓటీటీలోకి వచ్చాయి. తాజాగా స్ట్రీమింగ్​కు వచ్చిన వాటిలో సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, స్పై యాక్షన్‌ ఇలా ఒక్కోటి ఒక్కో జోనర్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

క్రియేషన్ ఆఫ్ ది గాడ్స్ 1 - ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌ అయిన ఈ చిత్రానికి ఐఎమ్‌డీబీలో 6.7 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది.

బోన్‌యార్డ్ (Boneyard Amazon prime ott) - నిజ జీవిత వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం బోన్‌యార్డ్. 2009లో 11 మంది అమ్మాయిలను ఓ సీరియల్ కిల్లర్‌ అతి కిరాతకంగా చంపుతాడు. అతడిని పట్టుకునేందుకు ఒక డిటెక్టివ్, ఒక పోలీస్​ కలిసి ఎఫ్‌బీఐలో జాయిన్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే కథ. ఇది అమెజాన్ ప్రైమ్‌లో హిందీతో పాటు తెలుగు, తమిళం, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంది.

బ్లింక్ ట్వైస్ ఓటీటీ - రీసెంట్​గా కన్నడలో విడుదలైన బ్లింక్ చిత్రం ఎంతటి విజయం సాధించిందో సినీ ప్రియులకు తెలిసే ఉంటుంది. ఇప్పుడదే సేమ్ టైటిల్​తో అమెరికన్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ట్వైస్ బ్లింక్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఇది అందుబాటులో ఉంది. ఇంగ్లీష్​తో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎమ్‌డీబీలో దీనికి 6.5 రేటింగ్ ఉంది.

బ్యూటీ ఇన్​ బ్లాక్ - ఈ అమెరికన్ డ్రామా బ్యూటీ ఇన్ బ్లాక్ నెట్‌ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి మొదటి ఎపిసోడ్‌ అందుబాటులో ఉంది. ఇంగ్లీష్​తో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది.

లిటిల్ హార్ట్స్ ఓటీటీ - ఈ మలయాళ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ ఈ ఏడాది జూన్​లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎమ్‌డీబీలో ఈ చిత్రానికి 6 రేటింగ్ ఉంది. సినిమాలో ఆంటో జోస్ పెరైరా, అబీ ట్రేసా పాల్ దర్శకత్వం వహించారు.

హిడెన్ ఐడెంటిటీ ఓటీటీ(Hidden Identity korean) - కొరియన్ స్పై యాక్షన్ డ్రామా సిరీస్ హిడెన్ ఐడెంటిటీ తెలుగు వెర్షన్‌ను తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్​కు వచ్చింది. 2015లో వచ్చిందీ సిరీస్‌. ఇప్పుడు ఇది ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్‌ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్​కు ఐఎమ్‌డీబీలో 6.6 రేటింగ్ ఉంది.

'ఆ రెండు అగ్రనిర్మాణ సంస్థలకు అహంకారం ఎక్కువ' - ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్​!

'అది ఎలా చేశానో ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే' - సమంత

ABOUT THE AUTHOR

...view details