తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఓటీటీ వీకెండ్ వాచ్ - మొత్తం 19 సినిమా/సిరీస్​లు - THIS WEEK OTT MOVIES

ఈ వారం ఆసక్తికరమైన ఓటీటీ చిత్రాలు, సిరీస్​లు ఇవే!

This Week  OTT Movies
This Week OTT Movies (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2024, 3:51 PM IST

This Week OTT Movies : వీకెండ్ దగ్గరపడింది. ఈ నేపథ్యంలో ఓటీటీలో ఈ వీకెండ్ చూడాల్సిన చిత్రాలు, వెబ్ సిరీస్​ల గురించి ఇక్కడ వివరాలు తీసుకొచ్చాం. ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఆహా వీడియో, ఈటీవీ విన్, సోనీలివ్, జీ5 ప్లాట్​ఫామ్​లోకి ఇప్పటికే సినిమాలు వచ్చేయగా, మరికొన్ని శుక్ర, శనివారాల్లో రానున్నాయి. ఇంతకీ అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

మా నాన్న సూపర్ హీరో - టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన మా నాన్న సూపర్ హీరో సినిమా ఇప్పటికే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం (నవంబర్ 15) నుంచి జీ5 ఓటీటీలోకి కూడా రానుంది. అంటే ఈ చిత్రం రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉండనుందన మాట.

అమెజాన్‌ ప్రైమ్‌లోఇంకా ఇన్‌ కోల్డ్‌ వాటర్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 12, క్రాస్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 14 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

డెడ్‌పూల్ అండ్ వోల్వొరైన్ - హాలీవుడ్ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం డెడ్‌పూల్ అండ్ వోల్వొరైన్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంగ్లిష్ తోపాటు తెలుగులోనూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

డిస్నీ హాట్ స్టార్​లో ఆన్‌ ఆల్మోస్ట్‌ క్రిస్మస్‌ స్టోరీ (యానిమేషన్‌) కూడా నవంబరు 15 నుంచి అందుబాటులో ఉండనుంది.

రేవు - థియేటర్లలో విడుదలైన మూడు నెలల తర్వాత ఆహా ఓటీటీలోకి వచ్చింది రేవు. నవంబర్ 14 నుంచి ఇది స్ట్రీమింగ్ అవుతోంది. రివేంజ్ థ్రిల్లర్​తో ఇది తెరకెక్కింది. కొందరు మత్స్యకారుల చుట్టూ తిరిగే కథ ఇది.

అన్‌స్టాపబుల్ అల్లు అర్జున్ - అన్‌స్టాపబుల్ సీజన్ 4లో భాగంగా ఈ శుక్రవారం నవంబర్ 15 నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​తో బాలకృష్ణ చేసిన సందడి ఈ షోలో చూడొచ్చు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఈ షో స్ట్రీమింగ్ అవుతుంది.

ఉషా పరిణయం - ఈటీవీ విన్ ఓటీటీలోకి ఈ వారం వచ్చిన సినిమా ఉషా పరిణయం. ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ తెరకెక్కించారు. విజయ్​ భాస్కర్ తనయుడు శ్రీ కమల్ హీరోగా నటించారు. థియేటర్లలో విడుదలైన మూడున్నర నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. నవంబర్ 14 నుంచి ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

పైఠనీ - జీ5 ఓటీటీలోకి నవంబర్ 15 నుంచి రానున్న చిత్రం పైఠనీ. మగ్గంపై చీరలు నేసే తన తల్లి వారసత్వాన్ని కొనసాగించడానికి ఓ కూతురు సాగించే పోరాటమే ఈ చిత్రం.

ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ -నవంబర్ 15 నుంచి సోనీలివ్ ఓటీటీలోకి రానున్న సరికొత్త వెబ్ సిరీస్ ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్. దేశ విభజన సమయంలో జరిగిన సంఘటనల బ్యాక్​డ్రాప్​లో ఇది తెరకెక్కింది. హిందీతో పాటు తెలుగులోనూ ఇది స్ట్రీమింగ్ కానుంది.

ఏఆర్ఎం - మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ, టొవినో థామస్ నటించిన ఏఆర్ఎం కూడా ఈ వారమే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాను హాట్‌స్టార్​లో తెలుగులో చూడొచ్చు.

ది వాచర్స్ - హారర్ థ్రిల్లర్ జానర్ ది వాచర్స్ మూవీ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ అడవిలో వెళ్తూ అక్కడి ఓ బంకర్​లో చిక్కుకుపోయిన కొందరు వ్యక్తుల చుట్టూ నడిచే కథ ఇది.

నెట్‌ఫ్లిక్స్​ ఓటీటీలో

  • ఎమిలియా పెరెజ్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 13
  • హాట్‌ ఫ్రాస్టీ (వెబ్‌సిరీస్‌) నవంబరు 13
  • రిటర్న్‌ ఆఫ్‌ ది కింగ్‌ (డాక్యుమెంటరీ మూవీ) నవంబరు 13
  • మైక్‌ టైసన్‌ వర్సెస్‌ పాల్‌ జాక్‌ (హాలీవుడ్) నవంబరు 15
  • కోబ్రా కై (వెబ్‌సిరీస్‌) నవంబరు 15

ఆపిల్‌ టీవీ ప్లస్‌ ఓటీటీలో

  • బ్యాడ్‌ సిస్టర్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 13
  • సిలో (వెబ్‌సిరీస్‌) నవంబరు 15

లయన్స్‌ గేట్‌ ప్లే

  • ఆపరేషన్‌ బ్లడ్‌ హంట్‌ (తెలుగు డబ్బింగ్‌) నవంబరు 15

సూర్య పీరియాడికల్ డ్రామా - 'కంగువా' మూవీ ఎలా ఉందంటే?

వరుణ్‌ తేజ్‌ - గ్యాంగ్​స్టర్ డ్రామా​ 'మట్కా' ఎలా ఉందంటే?

ABOUT THE AUTHOR

...view details