ETV Bharat / entertainment

'పుష్ప 2' కలెక్షన్ల సునామీ- 21 రోజుల్లోనే రూ.1700 కోట్లు వసూల్ - PUSHPA 2 COLLECTION

బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న పుష్ప మేనియా- 'బాహుబలి 2' ఆల్​టైమ్ వసూళ్లను దాటేయడం పక్కా!

Pushpa 2 Worldwide Collection
Pushpa 2 Worldwide Collection (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 14 hours ago

Pushpa 2 Collection : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1705 కోట్లు వసూళ్లు సాధించింది. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్​మెంట్ ఇచ్చారు. అయితే ఈ స్థాయి వసూళ్లు కేవలం 21 రోజుల్లోనే రావడం విశేషం.

హిందీలో రికార్డులు
బాలీవుడ్​లో 'పుష్ప'కు రిలీజ్ ముందు నుంచే విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక సినిమాకు మంచి టాక్ రావడం వల్ల హిందీ వసూళ్లలో పుష్పరాజ్ జోరు ప్రదర్శిస్తున్నాడు. ఒక్క హిందీలోనే ఈ సినిమా రూ.700 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఈ క్రమంలో బాలీవుడ్‌ హిస్టరీలో తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి.

బాహుబలి- 2 దగ్గరలో
ఇక తెలుగు ఇండస్ట్రీ ఆల్​టైమ్ హెయ్యెస్ట్​ కలెక్షన్స్ సాధించిన సినిమాగా 'బాహుబలి 2' టాప్​లో ఉంది. 2017లో విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1800+ పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో 'పుష్ప 2' ప్రస్తుతం బాహుబలి వసూళ్లకు అతి దగ్గరగా ఉంది. ఇక ఇటీవల ఈ సినిమా 3D వెర్షన్ కూడా రిలీజైంది. అలాగే ఈ వీకెండ్​లో బడా సినిమాల రిలీజ్​లు లేకపోవడం వల్ల 'పుష్ప 2' జోరు మరో వారం కొనసాగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన త్వరలోనే 'బాహుబలి 2'ని 'పుష్ప 2' దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఓటీటీలోకి అప్పుడే?
'పుష్ప- 2' ఓటీటీలోకి వచ్చేస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు ఇటీవల ట్రెండ్‌ అయ్యాయి. జనవరి రెండో వారం నుంచి స్ట్రీమింగ్‌ కానుందంటూ చర్చ సాగింది. ఆ వార్తలపై మేకర్స్ స్పందించారు. థియేటర్లలో విడుదలైన నాటి నుంచి 56 రోజుల కంటే ముందు ఏ ఓటీటీలోనూ ఈ మూవీ రిలీజ్‌ కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ లెక్కన ఫిబ్రవరి తొలి వారంలో పుష్ప 2 ఓటీటీలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

@1500 కోట్లు - ​కమర్షియల్‌ సినిమాకు కొత్త నిర్వచనం చెప్పిన 'పుష్ప 2'

బాలీవుడ్‌ అడ్డాలో 'పుష్ప 2' సరికొత్త రికార్డ్ - 100 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.