Modi On Delhi Results 2025 : ఆమ్‌ఆద్మీ పార్టీ షార్ట్‌కట్ రాజకీయాలకు దిల్లీ ఓటర్లు షార్ట్ సర్య్కూట్ ఇచ్చారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పదేళ్ల కష్టాలు, సమస్యల నుంచి దిల్లీకి విముక్తి లభించిందన్నారు. దిల్లీని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ శ్రేణులు ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మోదీని గజమాలతో సత్కరించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేసించిన ప్రధాని మోదీ ప్రసంగించారు.
"దిల్లీ విజయం సామాన్య విషయం కాదు. వికసిత్ రాజధానిగా మార్చే అవకాశం ఇచ్చింనందుకు దిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు. దిల్లీ ప్రజలు చూపించిన ప్రేమను అనేక రెట్లు పెంచి తిరిగిస్తాం. పదేళ్ల కష్టాలు, సమస్యల నుంచి దిల్లీకి విముక్తి లభించింది. పదేళ్లపాటు దిల్లీని అహంకారంతో పరిపాలించారు. ఇక నుంచి దిల్లీలో వికాస్, విజన్, విశ్వాస్ నినాదాలతో పరిపాలన. దిల్లీ విజయానికి కష్టపడిన కార్యకర్తలకు అభినందనలు. నిజమైన విజేతలు దిల్లీ ప్రజలే. అడ్డదారుల్లో వచ్చిన వారికి ప్రజలు షాక్ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు మొత్తం సీట్లు మాకే ఇచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కారుపై ఇక్కడి ప్రజలు నమ్మకం ఉంచారు. హరియాణా, మహారాష్ట్రలో కూడా గొప్ప విజయం సాధించాం. దిల్లీ ఒక మినీ భారత్. దిల్లీలో గెలిచామంటే దేశమంతా బీజేపీ దీవించినట్లే. దిల్లీ అభివృద్ధికి నాది గ్యారెంటీ."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
'మా పని తీరు చూసే మళ్లీ పట్టం కట్టారు'
మెట్రో పనులు ముందుకెళ్లకుండా ఆప్ నేతలు అడ్డుకున్నారు. ఆయుష్మాన్ భారత్ లాభం దిల్లీ ప్రజలకు దక్కకుండా చేశారు. దిల్లీలో అభివృద్ధికి ఎవరు అడ్డు పడుతున్నారో ప్రజలు గ్రహించారు. అన్నీ ఆలోచించే డబుల్ ఇంజిన్ సర్కారును కోరుకున్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో నిజమైన అభివృద్ధి చూడొచ్చు. మన పనితీరు చూసే అనేక రాష్ట్రాల్లో మళ్లీ మనకే అధికారం కట్టబెట్టారు. హరియాణాలో సుపరిపాలనకు నాంది పలికాం. మహారాష్ట్ర రైతులకు అన్ని విధాలా అండగా ఉన్నాం. ఏపీలో చంద్రబాబు తన ట్రాక్ రికార్డు నిరూపించుకున్నారు. సుపరిపాలన ఫలాలు పేదలు, మధ్యతరగతి ప్రజలకు దక్కాయి. దిల్లీ మెట్రోను మొట్టమొదట మేమే ప్రారంభించాం. అనేక నగరాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నాం. దిల్లీని వాయుకాలుష్యం, పారిశుద్ధ్య సమస్యలు పీడిస్తున్నాయి. దిల్లీని సరికొత్త ఆధునిక నగరంగా మారుస్తాం అని మోదీ హమీ ఇచ్చారు.
VIDEO | Delhi Election Results 2025: Addressing BJP workers at party headquarters in Delhi, PM Modi (@narendramodi) says, " people of delhi are filled with enthusiasm today. they are also relieved because delhi is now free of 'aap-da'. i had sent a letter to delhiites in which i… pic.twitter.com/VCsoD5CO21
— Press Trust of India (@PTI_News) February 8, 2025
బీజేపీపై విశ్వాసం ఉంచారు: జేపీ నడ్డా
దిల్లీలో చరిత్రాత్మక విజయం సాధించారని, అందుకోసం కార్యకర్తలు ఎంతో కృషి చేశారని జేపీ నడ్డా అన్నారు. 'మోదీ నేతృత్వంలో పార్టీ వరుస విజయాలు సాధిస్తోంది. దిల్లీ ప్రజలు మా పార్టీపై విశ్వాసం ఉంచారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లోనూ దిల్లీ ప్రజలు మా పార్టీని గెలిపించారు. పేదలు, బలహీనవర్గాల జీవితాల్లో మార్పు తేవడమే మోదీ లక్ష్యం. దిల్లీలో సుపరిపాలన అందించేందుకు కట్టుబడి ఉన్నాం. దిల్లీ ప్రజలు సురక్షితమైన తాగునీరు, మంచి రహదారులు కోరుకుంటున్నారు. ఆప్ అబద్ధాలు ఆడే పరిశ్రమ లాంటిది. దిల్లీ ప్రజల సమస్యలన్నీ గాలికి వదిలేసింది' అని నడ్డా విమర్శించారు.
VIDEO | Delhi Election Results 2025: Here's what BJP national president JP Nadda (@JPNadda) said while addressing party workers at party headquarters in Delhi.
— Press Trust of India (@PTI_News) February 8, 2025
" first of all, i would like to welcome pm modi to this event where we are celebrating this historic victory at bjp… pic.twitter.com/ad4Uo44Vo5