Director Bobby About Balakrishna : సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు నందమూరి నట సింహం బాలకృష్ణ. త్వరలోనే 'డాకు మహారాజ్'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా జనవరి 12న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా బాబీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'డాకు మహారాజ్'లో బాలయ్యను మీరు ఇప్పటి వరకు చూడని విధంగా చూస్తారని అన్నారు. సెట్‌లో బాలకృష్ణ ఎనర్జీ అన్‌స్టాపబుల్ అని చెప్పారు.
"ఈ సినిమాలో ఒక్క సీన్‌కు కూడా డూప్‌ను అస్సలు ఉపయోగించలేదు. ఎంత కష్టమైన సీన్ అయినా సరే బాలకృష్ణనే స్వయంగా చేసేవారు. ఆయన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ చిత్ర కథ రాశాను. 'గేమ్ ఛేంజర్'కు మా సినిమా పోటీ కాదు. అయితే సంక్రాంతికి రెండు, మూడు పెద్ద సినిమాలు రిలీజవ్వడం కామనే. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. యానిమల్ రిలీజ్ కంటే ముందే బాబీ దేవోల్‌కు ఈ సినిమా గురించి చెప్పాం. బాలకృష్ణ పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో బాబీ దేవోల్ రోల్‌కు కూడా అంతే ఉంటుంది. ఆయన తన పాత్రకు వందశాతం న్యాయం చేశారు. ఇక బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరిని చూసి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. డైరెక్టర్ ఏం చెబితే బాలకృష్ణ అది చేస్తారు. జనవరి 4న డల్లాస్‌లో 'డాకు మహారాజ్'కు సంబంధించి స్పెషల్ ఈవెంట్ చేస్తున్నాం" అని బాబి అన్నారు.
ఇక 'డాకు మహారాజ్' విషయానికి వస్తే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. బాబీ దేవోల్, చాందిని చౌదరి, బాబీ దేఓల్, రవి కిషన్ తదితరులు నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో మేకర్స్ ఫుల్ బిజీగా ఉన్నారు.
'అఖండ 2' రిలీజ్ డేట్ ఫిక్స్ - బాలయ్య డైలాగ్‌తో కొత్త ప్రోమో అదిరింది
'డూప్‌లు లేవు, డూప్లికేట్లు లేవు - గుర్రం ఎక్కింది, నడిపింది బాలయ్యనే'