తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఈ ఒక్కరోజే OTTలోకి వచ్చేసిన 11 క్రేజీ సినిమా/సిరీస్​లు - బ్లాక్​ బస్టర్స్​​ 'లక్కీ భాస్కర్​', 'క' కూడా - THIS WEEK OTT MOVIES IN TELUGU

వీకెండ్ స్పెషల్​ - ఓటీటీలోకి బోలేడు సినిమాలు.

This Week OTT Movies In Telugu
This Week OTT Movies In Telugu (source ETV Bharat and Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2024, 1:19 PM IST

This Week OTT Movies In Telugu :వీకెండ్​ వచ్చేసింది. అయితే సాధారణంగా శుక్రవారం, శనివారం ఎక్కువ సినిమాలు స్ట్రీమింగ్​కు వస్తుంటాయి. అయితే ఈ సారి ఓటీటీలోకి ఒకరోజు ముందే నేడు (నవంబర్ 28) 11 సినిమా, సిరీస్​లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఆరు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో ఒకటి రూ.100 కోట్లు వసూలు చేసిన బ్లాక్ బస్టర్ క్రైమ్ థ్రిల్లర్‌ కూడా ఉంది. ఇంతకీ ఈ రోజు అందుబాటులోకి వచ్చిన ఆ సినిమా, సిరీస్​లు ఏంటో తెలుసుకుందాం.

  • ది మ్యాడ్‌నెస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్, నెట్​ఫ్లిక్స్​)- నవంబర్ 28
  • దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ (తెలుగు సినిమా, నెట్​ఫ్లిక్స్​) - నవంబర్ 28
  • 'క' మూవీ (తెలుగు చిత్రం, ఈటీవీ విన్​)- నవంబర్ 28
  • సందేహం (తెలుగు సినిమా, ఈటీవీ విన్)- నవంబర్ 28
  • వికటకవి (తెలుగు వెబ్ సిరీస్, జీ5)- నవంబర్ 28
  • డివోర్స్ కే లియే కుచ్ బీ కరేగా (హిందీ వెబ్ సిరీస్, జీ5)- నవంబర్ 29
  • తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి (తెలుగు మూవీ, ఆహా)- నవంబర్ 28

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

  • నారదన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సినిమా, అమెజాన్ ప్రైమ్)- నవంబర్ 29
  • ఫైండ్ మీ ఇన్ పారిస్ సీజన్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్, అమెజాన్ ప్రైమ్)- నవంబర్ 28
  • సేవింగ్ గ్రేస్ (ఫిలిపినో వెబ్ సిరీస్)- నవంబర్ 28
  • మై స్టార్ బ్రైడ్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ కొరియన్ వెబ్ సిరీస్)- నవంబర్ 28
  • చెస్ట్‌నట్ (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా మూవీ)- నవంబర్ 28
  • హార్డ్ నార్త్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 29
  • బార్డర్‌ల్యాండ్స్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ)- నవంబర్ 28

ఆసక్తి రేపుతోన్న తెలుగు సినిమాలివే

కిరణ్ అబ్బవరం పీరియాడిక్ ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ 'క', దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి బ్యాంక్ క్రైమ్ థ్రిల్లర్ 'లక్కీ భాస్కర్' ఆసక్తి రేపుతున్నాయి.

తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన తొలి డిటెక్టివ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ వికటకవి, ఇంకా సందేహం, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్​గానే ఉన్నాయి. కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్ మై స్టార్ బ్రైడ్ కూడా తెలుగులోనే ఉంది.

RC 16 సూపర్ అప్డేట్​ ఇచ్చిన ఏఆర్​ రెహమాన్!​ - ఏంటంటే?

'పుష్ప 2' ఎఫెక్ట్​ - రేసు నుంచి వైదొలిగిన రష్మిక బాలీవుడ్ సినిమా

ABOUT THE AUTHOR

...view details