This Week Movies OTT Releases:2024 సంక్రాతి సినిమాల సందడి కొనసాగుతుండగనే మరోవైపు ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలో చిత్రాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. ఈ రిపబ్లిక్ డే వీక్‌లో థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యేందుకు రెడీ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏవో చూద్దాం.
ఫైటర్: హృతిక్ రోషన్- దీపికా పదుకొణె జంటగా నటించిన 'ఫైటర్' జనవరి 25న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాను డైరెక్టర్ సిద్ధార్థ్ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు. ఈ సినిమాలో హృతిక్ యుద్ధ విమాన పైలట్‌గా కనిపించనున్నారు. అనిల్ కపూర్ కీలక పాత్ర పోషించారు.
కెప్టెన్ మిల్లర్:ధనుష్ లీడ్ రోల్లో అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కెప్టెన్ మిల్లర్'. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. శివరాజ్‌కుమార్, సందీప్‌కిషన్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతికి తమిళంలో విడుదలైన ఈ సినిమా, జనవరి 25న తెలుగులో రిలీజ్ కానుంది.
అయలాన్:కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్- రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'అయలాన్' సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సంక్రాంతి బరిలో తెలుగు సినిమాల మధ్య పోటీ కారణంగా ఈ సినిమాను వాయిదా వేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా జనవరి 26న థియేటర్లలోకి రానుంది.
105 మినింట్స్:స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ లేటెస్ట్ సినిమా '105 మినింట్స్'. ఒకే ఒక్క పాత్రతో ఈ చిత్రం తెరకెక్కింది. రాజు దుస్సా దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 26న విడుదల కానుంది.
ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు,వెబ్ సిరీస్‌లు