తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఈ వారం 4 బెస్ట్ మలయాళం మూవీస్​ ఇవే - తెలుగులోనూ స్ట్రీమింగ్​! - This Week Best OTT Malayalam Movies - THIS WEEK BEST OTT MALAYALAM MOVIES

This Week OTT Malayalam Movies : ఈ వారం ఓటీటీలో సూపర్ హిట్​ మలయాళ సినిమాలు స్ట్రీమింగ్​కు వచ్చేశాయి. తెలుగులోనూ అందుబాటులో ఉన్నాయి. మరి మీరు మూవీ లవర్స్​ అయితే ఈ వీకెండ్​ ఇవి బెస్ట్ ఛాయిస్​ అని చెప్పొచ్చు. పూర్తి వివరాలు స్టోరీలో.

source Getty Images
This Week OTT Malayalam Movies (source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2024, 8:21 AM IST

This Week OTT Malayalam Movies : గత కొంత కాలం ఓటీటీల్లో మలయాళ సినిమాలకు బాగా క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే. అందుకే ఓటీటీ మూవీ లవర్స్​ ప్రతి వారం కొత్తగా మలయాళ చిత్రాలు ఏం వచ్చాయా అంటూ తెగ వెతికేస్తుంటారు. తెలుగు వారే కాదు ఇతర భాషల ప్రేక్షకులు కూడా దాదాపుగా ఇదే చేస్తున్నారు. అయితే ఈ వారం నాలుగు ఇంట్రెస్టింగ్​ మలయాళ సినిమాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. అందులో ఓ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ కూడా ఉంది. అలానే ఓ కామెడీ డ్రామా కూడా ఉంది. తెలుగులోనూ ఇవి స్ట్రీమింగ్ అవుతున్నాయి! ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.

నునకుళి - మరో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నునకుళి. ఇది కూడా జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాలో గ్రేస్ ఆంటోనీ, బాసిల్ జోసెఫ్, బైజూ సంతోష్, సిద్ధిఖీ, నిఖిల విమల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. దృశ్యం ఫేమ్​ డైరెక్టర్ జితూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. పర్సనల్ వీడియో ఉన్న ల్యాప్‍టాప్‍ను ఓ ఐటీ అధికారి సీజ్ చేయగా దాన్ని తిరిగి దక్కించుకునేందుకు ఓ వ్యక్తి చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ.

తలవన్ - మలయాళ క్రైమ్ థ్రిల్లర్ తలవన్ సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి మంచి రెస్పాన్స్​ దక్కుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో అందుబాటులో ఉంది. థియేటర్లలోనూ ఈ సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది. సినిమాలో బిజూ మేనన్, ఆసిఫ్ ప్రధాన పాత్రలు పోషించారు. జిస్ జాయ్ దర్శకత్వం వహించారు. జీ5 ఓటీటీలోకి వచ్చాక ఈ చిత్రానికి మరింత రెస్పాన్స్​ పెరిగింది.

విశేషం - ఫ్యామిలీ కామెడీ డ్రామా 'విశేషం' కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ ఉన్నాయి. మధుసూధన్, ఆనంద్, బైజూ జాన్సన్, చిన్ను చాందినీ, జానీ ఆంటోనీ, అల్తాఫ్ సలీమ్, పీపీ కున్నికృష్ణమ్ సినిమాలో నటించారు. సూరజ్ టామ్ దర్శకత్వం వహించారు.

పట్టపాకల్ - అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ డార్క్ కామెడీ డ్రామా అందుబాటులో ఉంది. థియేటర్లలోనూ ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. చిత్రంలో ఆషిక అశోకరన్, జానీ ఆమటోనీ, రమేశ్ పిషరోడీ, కృష్ణ శంకర్, సుధి కొప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. సాజిర్ సదాఫ్ డైరెక్ట్ చేశారు.

పవన్‌, మహేశ్‌ ఎవరి సినిమాలో నటిస్తారు? - ఖుష్బూ ఏం చెప్పారంటే? - Actress Kushboo Sundar

కెరీర్​లోలో 180 ఫ్లాపులు! - అయినా ఇప్పటికీ ఆ హీరో సూపర్ స్టారే! - Most Flops Hero

ABOUT THE AUTHOR

...view details