తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నేను, ప్రభాస్ ఎవరో వాళ్లకు తెలీదు' - టైర్​ 1, టైర్​ 2 ట్యాగ్​లపై రానా రియాక్షన్​ - THE RANA DAGGUBATI SHOW

'ది రానా దగ్గుబాటి షో' ట్రైలర్‌ విడుదల సందర్భంగా హీరో రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్​!

Rana Prabhas
Rana Prabhas (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2024, 9:28 PM IST

The Rana Daggubati Show : ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయా కథానాయకుల మార్కెట్​, స్టార్​ డమ్​ ఆధారంగా టైర్​ 1, టైర్ 2 హీరోలుగా ట్యాగ్​ ఇస్తుంటారు. అయితే తాజాగా ఈ నెంబర్లల ట్యాగ్​పై విలక్షణ నటుడు రానా స్పందించారు. 'ది రానా దగ్గుబాటి షో' ట్రైలర్‌ లాంఛ్​ ఈవెంట్‌లో దీని గురించి మాట్లాడారు.

'మీ షోను పాన్‌ ఇండియా స్టార్లతో కాకుండా టైర్‌ 2 హీరోలతో ప్రారంభించారు ఎందుకు?' అని అడగగా - రానా మాట్లాడుతూ 'అవేమైనా ట్రైన్‌ బెర్తులా..?' అని నవ్వుతూ సమాధానమిచ్చారు. "సినిమాలు తీసే వారికి లెక్కలుంటాయి కానీ చూసే ప్రేక్షకుడికి కాదు. కంటెంట్‌ నచ్చితే వారు చూస్తారంతే. రీజనల్ మూవీగా తెరకెక్కిన హనుమాన్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ఆదరించారు. అంతెందుకు బాహుబలికి ముందు మేం(ప్రభాస్, రానా) కూడా ఎవరో బాలీవుడ్‌ ప్రేక్షకులకు పెద్దగా తెలీదు. ఆ సినిమా ప్రచారం కోసం ముంబయి వెళ్లినప్పుడు మమ్మల్ని మేం పరిచయం చేసుకున్నాం. సినిమానే యాక్టర్స్​ను స్టార్స్​ చేస్తుంది. టైర్‌ 1, టైర్‌ 2 అనేది చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ నేను దాన్ని నమ్మను" అని అన్నారు.

The Rana Daggubati Show Pawan Kalyan :"ఒక్కో ఎపిసోడ్‌ను దాదాపు 4 గంటల పాటు షూట్ చేశాం. దాదాపు 40 నిమిషాల నిడివితో ఇది స్ట్రీమింగ్‌ అవుతుంది. వీటన్నింటిలో రిషభ్​ శెట్టి ఎపిసోడ్‌ చాలా స్పెషల్​గా ఉంటుంది. నాకేమో కన్నడ రాదు. ఆయనకేమో తెలుగు రాదు. అయితే హిందీలో బాగా మాట్లాడతారు. కానీ, నాకేమో హిందీలో ప్రశ్నలు వేయడం సరిగ్గా రాదు. మా ఇద్దరికీ తమిళం మాత్రం కొంత తెలుసు. దీంతోనే మేనేజ్‌ చేశాను. ఇక పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల మా షోకు వచ్చే అవకాశం లేదు" అని రానా పేర్కొన్నారు. కాగా, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ నెల 23 నుంచి ఈ రానా షో ప్రసారం కానుంది.

ఇంటెన్సివ్​గా 'కుబేర' గ్లింప్స్​ - డబ్బు చుట్టూ సాగే ఎమోషన్స్​

'డూప్​లు లేవు, డూప్లికేట్​లు లేవు - గుర్రం ఎక్కింది, నడిపింది బాలయ్యనే'

ABOUT THE AUTHOR

...view details