Vijay Devarkonda Rashmika : చిత్ర పరిశ్రమలో హీరో విజయ్ దేవరకొండ - హీరోయిన్ రష్మికలకు ఉన్న ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. వీరిద్దరూ ఎక్కడ కనిపించినా ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపించడం, ఫ్యాన్స్ ఆనందపడటం జరుగుతుంటుంది. అదే వీరిద్దరు కలిసి కనిపిస్తే ఇక ఆ రోజు అంతా సోషల్ మీడియా వీరి హవానే కొనసాగుతుంటుంది. వీరిద్దరి రిలేషన్షిప్ గురించి గాసిప్స్ చక్కర్లు కొడుతూనే ఉంటాయి.
అయితే తాజాగా ఈ జంట ముంబయి విమానాశ్రయంలో తళుక్కున కనిపించి మరోసారి సర్ప్రైజ్ ఇచ్చారు. సోమవారం రాత్రి వీరిద్దరూ ముంబయి ఎయిర్ పోర్ట్‌లో కనిపించారు. అయితే ముందుగా ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన రష్మిక ఫొటో గ్రాఫర్లకు పోజులిచ్చింది. అభిమానులతో కలిసి ఫొటోలు దిగి సందడి చేసింది.
ఇది జరిగిన కాసేపటికే విజయ్ దేవరకొండ కూడా అక్కడ కనిపించి సందడి చేశారు. దీంతో వీరిద్దరూ క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్తున్నారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇటీవలే ఈ జంటకు సంబంధించిన ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. రెస్టారంట్‌లో వీరిద్దరూ కలిసి కనిపించారు.
కాగా, విజయ్ దేవరకొండ - రష్మిక రిలేషన్షిప్లో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై విజయ్ దేవరకొండ, రష్మిక ఇప్పటికే పలు సార్లు స్పందించారు. తామిద్దరు మంచి స్నేహితులం అని అన్నారు. అయినప్పటికీ వీరిపై గాసిప్స్ మాత్రం ఆగట్లేదు.
ఇకపోతే రీసెంట్‌గానే విజయ్ దేవరకొండ తన డేటింగ్ రూమర్స్‌పై మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా తాను అన్ని విషయాలు బయటకు చెబుతానని పేర్కొన్నారు. ‘‘అపరిమితమైన ప్రేమ అనేది ఉందో, లేదో నాకు తెలియదు. ఒకవేళ అదే ఉంటే, దాంతో పాటే బాధ కూడా ఉంటుంది. మీరు, ఎవరైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి ఉంటుంది" అని అన్నారు.
ఆ మధ్య ప్రేమ గురించి రష్మిక కూడా మాట్లాడింది. "జీవితంలో ప్రతిఒక్కరికీ తోడు కావాలి. నా దృష్టిలో ప్రేమలో ఉండడం అంటే భాగస్వామిని కలిగి ఉండడమే. తోడు లేకపోతే జీవితానికి ఏ ప్రయోజనం ఉండదు. మన ఒడుదొడుకుల్లో మనతో ఉండి అండగా ఉండేవారు ఉండాలి" అని చెప్పింది.
ఉపేంద్ర 'యూఐ'పై యశ్, కిచ్చా సుదీప్ కామెంట్స్
ఒక్క సినిమా కోసం 5 లక్షల మంది నిర్మాతలు - హైదరాబాదీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ సినీ జర్నీ విశేషాలివే