Rahasyam Idam Jagath OTT : ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్'లో మరో కొత్త సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది. 'రహస్యం ఇదం జగత్' అనే సినిమా ఈటీవీ విన్‌లో డిసెంబర్ 26నుంచి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇది పురాణాల కథతో రూపొందిన సైన్స్ ఫిక్షన్ సినిమా. దర్శకుడు కోమల్ ఆర్. భరద్వాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాకేశ్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా, నవంబరు 8న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.
కథేంటంటే : అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు అభి (రాకేశ్). అక్కడే పనిచేసే అకీరా (స్రవంతి)ను ప్రేమిస్తాడు. తండ్రి చనిపోవడంతో ఇండియాకు వచ్చేయాలనుకుంటుంది అకీరా. ఆమెతోపాటు అభి కూడా స్వదేశానికి రావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన మరో జంటతో వారికి గొడవ అవుతుంది. దానికి కారణమేంటి?మిత్రులను కాపాడుకునేందుకు మల్టీ యూనివర్స్‌లోని వామ్‌హోల్‌లోకి ఎలా వెళ్లగలిగాడు? అకీరాతో కలిసి ఇండియాకు వచ్చాడా?వంటి ఆసక్తికర అంశాలతో కూడిన కథ ఇది.
Experience the mystery of Rahasyam Idham Jagath! Streaming exclusively on @ETVWin from December 26. Don’t miss this thrilling journey!#RahasyamIdhamJagath!@SCUProduction @kravinuth @rakesh_galebhe @Sravs_Actress @mansavee @adinaidude @Gyaanimusic @ChotaKPrasad @GvssB#EtvWin pic.twitter.com/iN4OdfOhS3
— ETV Win (@etvwin) December 24, 2024