ETV Bharat / entertainment

'పుష్ప 2' ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​ - ఇకపై దేశవ్యాప్తంగా ఆ ఫార్మాట్​లోనూ ప్రదర్శన - PUSHPA 2 HINDI VERSION

'పుష్ప 2' - సరికొత్త అప్డేట్ ఇచ్చిన మూవీ టీమ్.

Pushpa 2 3D Screening
Pushpa 2 3D Screening (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 14 hours ago

Pushpa 2 3D Screening : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ ముందు అదరగొడుతోంది. విడుదలై 20 రోజులు దాటినప్పటికీ కలెక్షన్ల జోరు మాత్రం ఆగట్లేదు. ఇప్పటికే ఈ సినిమా రూ.1500 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ఇక మూవీ లవర్స్​కు మేకర్స్​ తాజాగా గుడ్​న్యూస్ చెప్పారు. ఈ సినిమా త్రీ డీ వెర్షన్ అందుబాటులోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా త్రీడీలో అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా త్రీడీ వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా హిందీలో ఈ చిత్ర త్రీడీ వెర్షన్‌ ప్రదర్శస్తున్నట్లు మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్​గా ప్రకటించింది.

అప్పుడే అనుకున్నా
అయితే ఈ సినిమాను ముందుగా వరల్డ్​వైడ్​ త్రీడీలోనే రిలీజ్ చేయాలని మేకర్స్​ భావించారు. కానీ, పలు కారణాల వల్ల అప్పుడు త్రీ డీ వెర్షన్​లో విడుదల చేయడం కుదరలేదు. ఇక తాజాగా హిందీ భాషలో దీని త్రీడీ వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది.

బీటౌన్​లో జోరు
బాలీవుడ్​లో 'పుష్ప'కు రిలీజ్ ముందు నుంచే విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక సినిమాకు మంచి టాక్ రావడం వల్ల హిందీ వసూళ్లలో పుష్పరాజ్ జోరు ప్రదర్శిస్తున్నాడు. ఒక్క హిందీలోనే ఈ సినిమా రూ.700 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఈ క్రమంలో బాలీవుడ్‌ హిస్టరీలో తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. ఇక ఈ వారంలో క్రిస్మస్ హాలీడేస్ ఉండడం వల్ల ఈ వీకెండ్​ కలెక్షన్లు మరింత పెరగడం పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కాగా, పుష్ప మూవీయూనిట్​కు బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణసంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ అభినందనలు తెలిపింది. హీరో అల్లు అర్జున్‌, రష్మిక ఆ పోస్ట్‌కు రిప్లై ఇస్తూ థాంక్స్‌ చెప్పారు. 'పాత రికార్డులను ఈ సినిమా బద్దలుకొడుతోంది. ఎన్నో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. చరిత్రను తిరగరాస్తున్నందుకు 'పుష్ప2' టీమ్‌కు అభినందనలు. ఇది ఫైర్‌ కాదు, వైల్డ్‌ ఫైర్‌' అని నిర్మాణసంస్థ పేర్కొంది.

'పుష్ప 2' ఓటీటీ రిలీజ్​పై మూవీటీమ్ క్లారిటీ - విడుదల​ అప్పుడే

బాలీవుడ్‌ అడ్డాలో 'పుష్ప 2' సరికొత్త రికార్డ్ - 100 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.