తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాక్సాఫీస్‌కి పండగ కళ - నెలలో పదికిపైగా సినిమాలు - ప్రేక్షకులకు ఫుల్ వినోదం - Telugu Movies Releases Dasara - TELUGU MOVIES RELEASES DASARA

Telugu Movies Releases on Dasara : 2024 దసరాకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వరుస సినిమాలు క్యూ కట్టాయి. మరి ఈ నెలలో రిలీజ్​కు సిద్ధమైన సినిమాలు ఏంటంటే?

Telugu Movies Releases Dasara
Telugu Movies Releases Dasara (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2024, 7:28 AM IST

Telugu Movies Releases on Dasara : ప్రతి ఏడాదిలాగే ఈ దసరాకు కూడా బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి ఉండనుంది. అన్​లిమిటెడ్ ఎంటర్టైన్​మెంట్​తో ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలు సిద్ధం అవుతున్నాయి. దసరా, దీపావళి సెలవుల సందర్భంగా వరుస సినిమాలు రిలీజ్​కు రెడీ అవుతున్నాయి. మరి అక్టోబర్​ నెలలో టాలీవుడ్​ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న సినిమాలు ఏంటంటే?

  1. శ్వాగ్ : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు- రితూ వర్మ లీడ్​ రోల్స్​లో నటించిన శ్వాగ్ (Swag) అక్టోబర్ 04న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.​ దీంతో మూవీలవర్స్​ ఈ చిత్రం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
  2. విశ్వం : యంగ్ హీరో గోపీచంద్ కూడా ఈసారి దసరా బాక్సాఫీస్ ఫైట్​కు సిద్ధమయ్యారు. ఆయన లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'విశ్వం' అక్టోబర్ 11 విడుదల కానుంది. ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. గోపిచంద్- శ్రీనువైట్ల కాంబో సినిమాపై అంచనాలు పెంచుతోంది. శ్రీనువైట్ల మార్క్ వినోదం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ఆయన కమ్​బ్యాక్ ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు
  3. వేట్టయాన్ : సూపర్​స్టార్ రజనీకాంత్ 'వేట్టయాన్' కూడా ఈ దసరాకే రిలీజ్ కానుంది. ఈ సినిమా అక్టోబర్ 10న వరల్డ్​వైడ్​ గ్రాండ్​గా విడుదల కానుంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్‌ ఫాజిల్‌ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. రజనీ చిత్రంపై సహజంగానే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. పండగ సీజన్‌లో విడుదలవుతున్న ఈ సినిమా ఏ స్థాయిలో సందడి చేస్తుందో చూడాలి.
  4. జనక అయితే గనక : డిఫరెంట్ కథల ఎంపికతో ప్రేక్షకులను మెప్పించే యంగ్ హీరో సుహాస్ ఈసారి 'జనక అయితే గనక'తో రానున్నారు. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇది అక్టోబర్ 12న థియేటర్లలో రానుంది. ఇక సుధీర్‌బాబు హీరో నటించిన 'మా నాన్న సూపర్ హీరో' అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. వీటితోపాటు బాలీవుడ్ మూవీ 'జిగ్రా' అక్టోబర్ 11నే విడుదలకు సిద్ధమైంది. దీంతో ఈసారి వరుసగా మూడు రోజులు సినిమాల సందడి ఉండనుంది.

​దసరా తర్వాత 18, 25 తేదీలు లక్ష్యంగా మరికొన్ని చిత్రాలు ముస్తాబవుతున్నాయి. 'లగ్గం', 'గ్యాంగ్‌స్టర్‌', 'రివైండ్‌' తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. 'శ్రీశ్రీశ్రీ రాజావారు', 'రోటి కపడా రొమాన్స్‌' తదితర చిత్రాలూ ఈ నెలలోనే విడుదలకు సన్నద్ధమయ్యాయి.

దీపావళికి ఇవి!

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటించిన 'లక్కీ భాస్కర్‌', విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటించిన 'మెకానిక్‌ రాకీ', సత్యదేవ్, డాలీ ధనంజయ నటించిన 'జీబ్రా', వీటితోపాటు తమిళ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన 'అమరన్‌' ఈ నెల 31న విడుదల కానున్నాయి.

50 రోజుల తర్వాత సెట్స్​లోకి! - 'RT 75'ల షూటింగ్ ఎప్పుడు మొదలవ్వనుందంటే? - Raviteja 75 Movie New Schedule

'గేమ్ ఛేంజర్' సాలిడ్ అప్డేట్ - టీజర్ రిలీజ్ డేట్ చెప్పేసిన తమన్ - Game Changer Teaser

ABOUT THE AUTHOR

...view details