తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కృష్ణ - నగ్మాల మధ్య బికినీ తెచ్చిన తంట - ఈ వివాదం తెలుసా? - Nagma Bikini controversy - NAGMA BIKINI CONTROVERSY

SUPER STAR KRISHNA NAGMA : అప్పట్లో ఓ మూవీ షూటింగ్​లో సూపర్ స్టార్ కృష్ణ - సీనియర్ హీరోయిన్ నగ్మా మధ్య బికినీ తెచ్చిన వివాదం గురించి మీకు తెలుసా? ఈ విషయంపై ఓ దర్శకుడు కూడా నగ్మాను బాగా తిట్టారు. దీని గురించి పూర్తి కథనం స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం.

కృష్ణ - నగ్మాల మధ్య బికినీ తెచ్చిన తంట - ఈ వివాదం తెలుసా?
కృష్ణ - నగ్మాల మధ్య బికినీ తెచ్చిన తంట - ఈ వివాదం తెలుసా?

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 10:17 AM IST

Updated : Mar 26, 2024, 11:59 AM IST

SUPER STAR KRISHNA NAGMA : అలనాటి అందాల తార నగ్మా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. నగ్మా పేరు చెబితే 90ల కుర్రాళ్లు ఊగిపోయేవారు. ఆకట్టుకునే అందం, అంతకుమించిన అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసేది. తెలుగులో స్టార్ హీరోలు అయిన చిరంజీవి, నాగార్జున, బాలయ్య బాబు, వెంకటేశ్​లతో కలిసి నటించి అందర్నీ మెప్పించింది. తెలుగులో నగ్మా నటించిన కిల్లర్, అల్లరి అల్లుడు, ఘరాన మొగుడు, వారసుడు , మేజర్ చంద్రకాంత్, భాషా వంటి సినిమాలు అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశాయి. అంతేకాదు నగ్మాను చూసేందుకే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారంటే ఆమె పాపులారిటీ ఏలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో చివరిగా తారక్ హీరోగా వచ్చిన అల్లరి రాముడు సినిమాలో అత్త పాత్రలో నటించి అరించింది. అయితే నగ్మా - సూపర్ స్టార్ కృష్ణతో ఓ మూవీ చేసే సమయంలో కాస్త దురుసుగా బిహేవ్ చేసిందట. మూవీ షూటింగ్ సమయంలో బికినీ విషయంలో గొడవ అయిందట.

అసలు విషయం ఏంటంటే? నగ్మా - కృష్ణ కాంబినేషన్​లో భరత సింహం అనే మూవీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో మొదట నగ్మాకు ఆ చిత్ర నిర్మాతతో వాగ్వాదం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో రెండు పొట్టి నిక్కర్లు నగ్మా వేసుకోవాల్సిందట. కానీ ఈ పొట్టి నిక్కర్లు(బికినీలు)ను నగ్మానే తెచ్చుకోమని డైరెక్టర్ ప్రొడ్యూసర్​కు చెప్పారట. దీంతో ప్రొడ్యూసర్ కూడా నగ్మాకు ఈ విషయం చెప్పారట. నగ్మా రెండు బికినీలు తెచ్చుకుని వాటికి 60వేల రూపాయల బిల్లు చూపించిందట.

60వేల బిల్లు చూసి కంగుతున్న నిర్మాత ఆ డబ్బులను ఇచ్చేందుకు వెనకాడారట. దీంతో ఇద్దరి మధ్య గొడవ కాస్త పెద్దగా అయ్యిందట. ఆ విషయం తెలుసుకున్న డైరెక్టర్ సాగర్ నేనే ఆ డబ్బులు చెల్లిస్తానని చెప్పినా నగ్మా వినకుండా నాకు నిర్మాత ఇస్తేనే తీసుకుంటానని మొండికేసిందట. దీంతో డైరెక్టర్ సాగర్ నగ్మాకు వార్నింగ్ కూడా ఇచ్చారట. ఇక కోపంతో నగ్మా షూటింగ్ స్పాట్ నుంచి ఇంటికి వెళ్లిపోయిందట. ఎంతమంది చెప్పినా కూడా చిత్రీకరణకు రాలేదట.

ఈ వివాదంలోకి హీరో కృష్ణ కూడా ఎంట్రీ ఇచ్చి నగ్మాను ఒప్పించే ప్రయత్నం చేశారట. అయినా కూడా నగ్మా వినకపోవడంతో కథ మొత్తం మార్చేసి ఆమె పాత్రను మార్చేశారట. కానీ ఈ భరత సింహం సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. పైన చెప్పిన మొత్తం విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు దర్శకుడు సాగర్. ఈ మూవీ తర్వాత సాగర్ తన డైరెక్షన్​లో చేసే ఏ సినిమాలోనూ నగ్మను తీసుకోలేదట.

మీర్జాపూర్ మున్నా భయ్యా సినీ కష్టాలు - రూ.32ల కోసం హోటల్​లో వర్కర్​గా! - Divyendu Sharma

'కల్కి' బ్యూటీ దిశాపటానీ సిస్టర్​ను చూశారా? - ఆర్మీలో లెఫ్టినెంట్​ ఉద్యోగి - khushboo patani

Last Updated : Mar 26, 2024, 11:59 AM IST

ABOUT THE AUTHOR

...view details