Eshwar Movie Re Release Sridevi Vijaykumar : 2024 అక్టోబర్‌లో 'ఈశ్వర్' సినిమా రీ రిలీజ్ అవుతోంది. గతంలో ఈ మూవీతోనే ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇవ్వగా, శ్రీదేవి విజయ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. శ్రీదేవి కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత కొంత కాలం దూరంగా ఉన్నారు. తెలుగులో ఆమె చివరగా రవితేజ 'వీర'లో కనిపించారు. అయితే ఆమె ఇప్పుడు మళ్లీ సినిమాలు చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. మళ్లీ అవకాశం వస్తే ప్రభాస్‌తో యాక్ట్ చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. కాగా, ఆమె నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'సుందరకాండ'లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేయగా ఆకట్టుకుంది.
ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్తా -శ్రీదేవి మాట్లాడుతూ, "చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత నేను మళ్లీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను. మళ్లీ స్క్రీన్‌పై చూసుకోవడానికి ఎంతో ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అక్టోబర్‌లో ఈశ్వర్ రీ రిలీజ్ అవుతోంది. చాలా హ్యాపీగా ఉంది. కచ్చితంగా ఈశ్వర్ సినిమా చూడటానికి ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్తాను." అని చెప్పింది.
ప్రభాస్‌కు కంగ్రాచులేషన్స్ - "ముందు ప్రభాస్‌కు కంగ్రాచ్యులేషన్స్. ఈశ్వర్ నుంచి ఆయన ఎదుగుదలను చూస్తున్నాం. అందరం, టీమ్ అంతా హ్యాపీగా ఉంది. ప్రభాస్ అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. వెరీ స్వీట్. ఇంకా ఆయన మంచి మంచి సినిమాలు చేయాలి. 'ఈశ్వర్' షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా మెమరీస్ ఉన్నాయి. ఎవరికైనా మొదటి సినిమా చాలా స్పెషల్. ధూల్‌పేట్ ఏరియాలో షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. జయంత్ గారితో చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం.