తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​- సుధీర్ కొత్త టాలెంట్​- వీడియో చూశారా? - Sudheer Babu harom hara movie - SUDHEER BABU HAROM HARA MOVIE

Sudheer Babu New Talent : టాలీవుడ్ స్టార్ హీరో సుధీర్ బాబు తాజాగా తనలోని కొత్త టాలెంట్​ను ఫ్యాన్స్​కు చూపించారు. ఆయనలోని ఈ ప్రతిభను తమ తనయలిద్దరూ రివీల్ చేశారు. ఆ వీడియో మీ కోసం.

Sudheer Babu New Talent
Sudheer Babu New Talent (Source : ETV Bharat Archives)

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 5:13 PM IST

Sudheer Babu New Talent :టాలీవుడ్​ స్టార్ హీరో ప్రస్తుతం 'హరోం హర' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్​లో రూపొందిన ఈ మూవీ ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు మూవీ లవర్స్​ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సుధీర్ కూడా ఓ నయా స్టోరీతో రావడం వల్ల ఈ చిత్రంపై భారీ అంచనాలే పెరిగాయి.

ఇదిలా ఉండగా, తాజాగా ఈ సినిమా నుంచి మరో కొత్త పాట విడుదల చేశారు మేకర్స్. 'మురుగుడి మాయ' అంటూ సాగే ఆ పాట ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. లిరిక్స్​తో పాటు సాంగ్​కు కూడా మంచి క్రేజ్ వస్తోంది. అయితే తాజాగా హీరో సుధీర్ బాబు ఈ సాంగ్​ను తన వెర్షన్​లో విడుదల చేశారు. తన కుమారులిద్దరితో కలిసి పాడి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అందులో సుధీర్ ఎంతో చక్కగా ఈ సాంగ్​ను పాడగా, తనయులిద్దరూ ఆ వీడియోను తీసేందుకు సపోర్ట్ చేశారు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు 'సో క్యూట్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో 'సుధీర్​లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా' అంటూ కితాబులిస్తున్నారు.

ఇక 'హరోం హర' సినిమా విషయానికి వస్తే, కుప్పం నేపథ్యంలో రూపొందుతున్న ఓ ఫిక్షనల్‌ స్టోరీ ఇది. 1989-90 సంవత్సరాల మధ్యలో ఈ కథ జరిగినట్టుగా మేకర్స్ చూపించారు. అంతే కాకుండా నిజ జీవితంలో స్ఫూర్తి పొందిన పలు పాత్రలను ఆధారంగా చేసుకుని ఇందులో పాత్రలు క్రియేట్‌ చేసినట్లు తెలిపారు.

"ఈ స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకూ నేను ఇలాంటి కథలో నటించలేదు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా చక్కగానే కుదిరాయి. కథ, నటీనటుల పాత్రల చిత్రీకరణ, సినిమాలోని ప్రతి రంగంపై డైరెక్టర్​కు ఉన్న అభిరుచిని చూసి ఈ సినిమాకు ఓకే చెప్పాను." అంటూ సుధీర్ గతంలో ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.

'సినిమా బాలేదంటే నష్టపరిహారం చెల్లించిన రోజులున్నాయి - నేను చేసినంతగా ఏ హీరో చేయలేరు'

'మా ఇద్దరికి దిష్టి పెట్టేశారు.. భవిష్యత్తులో డైరెక్టర్​ అవుతానేమో!'

ABOUT THE AUTHOR

...view details