Double Ismart Shooting: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని- సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా నుంచి కొన్ని నెలలుగా ఎలాంటి అప్డేట్స్ లేవు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. అయితే డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా అభిమానుల్లో జోష్ నింపారు.
సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తున్నట్లు చేస్తున్నట్లు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు. 'మరో షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం. పలు కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్లో షూట్ చేయనున్నాం' అని పూరీ ట్వీట్లో రాసుకొచ్చారు. ముంబయిలో జరగనున్న ఈ షెడ్యూల్లో స్టార్ యాక్టర్లంతా పాల్గొననున్నారు. దీంతో రామ్ ఫ్యాన్స్‌లో కొత్త ఎనర్జీ వచ్చినట్లైంది.
ఆరోజు అప్డేట్ పక్కా!
అయితే త్వరలోనే ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల (మే 15)లో హీరో పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రామ్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రామ్ బర్త్‌డే రోజు సినిమా టీజర్ అండ్ రిలీజ్ డేట్ లేదా ఫస్ట్ సింగిల్ (సాంగ్) రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇస్తారో. ఇక ఈ సినిమాకు మ్యూజికల్ కింగ్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.