Mathu Vadalara 2 Collections :రీసెంట్ రిలీజ్ 'మత్తు వదలరా 2' చిత్రం ఫస్ట్ వీకెండ్‌లోనే లాభాల్లోకి అడుగుపెట్టింది! ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో జోరు చూపిస్తోంది. హిట్ టాక్‌తో దూసుకెళ్తోన్న ఈ క్రైమ్ కామెడీ చిత్రానికి మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి. రోజు రోజుకు ఈ సినిమా వసూళ్లను పెంచుకుంటూ పోతోంది. హిట్ టాక్‌తో పాటు వీకెండ్ కూడా కలిసి రావడంతో మంచి కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి.
తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.5 కోట్లతో మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం మూడు రోజులు పూర్తయ్యేసరికి(ఆదివారం నాటికి) మరిన్ని కలెక్షన్స్‌ను అందుకుంది. మూడు రోజుల్లో ఈ క్రైమ్ కామెడీ చిత్రానికి వరల్డ్ వైడ్‌గా రూ. 16.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీ టీమ్ కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
లాభాల్లోకి మత్తువదలరా 2 - కాగా, ఈ మత్తు వదలరా 2 చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.8 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అంటే ఈ లెక్కన ఆదివారం నాటికి నమోదైన వసూళ్లతో ఈ సీక్వెల్ బ్రేక్ టార్గెట్‌ను రీచ్ అయినట్లు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక సోమవారం(సెప్టెంబర్ 16) నుంచి వచ్చే వసూళ్లనీ లాభాలేనని చెబుతున్నాయి.