తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పుష్ప' సెట్స్ నుంచి ఫొటో లీక్- ఇంటర్నెట్​ను షేక్ చేస్తోందిగా! - PUSHPA 2 LEAKS

పుష్ప సెట్స్​నుంచి ఫొటో లీక్- నిమిషాల్లో వైరల్- మీరు చూశారా?

Pushpa Leaked Pic
Pushpa Leaked Pic (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2024, 9:49 AM IST

Pushpa 2 Leaks :ఐకాన్​స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాపై రోజురోజుకు బజ్ పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా సినీలవర్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినిమా గురించి మేకర్స్ ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా ఫ్యాన్స్​ తెగ సంబరపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో షూటింగ్ సెట్స్​ నుంచి ఓ ఫొటో లీక్ అయ్యింది. దీంతో ఇంటర్నెట్​లో పుష్ప మరోసారి ట్రెండింగ్​లోకి వచ్చేసింది

ప్రస్తుతం ఈ సినిమా స్పెషల్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. అయితే సాంగ్​ షూటింగ్​కు సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా లీక్ అయ్యింది. ఇందులో హీరో అల్లు అర్జున్, యంగ్ బ్యూటీ శ్రీలీల డ్యాన్స్ క్యాస్టూమ్​లో కనిపిస్తున్నారు. బ్యాక్​గ్రౌండ్​ అంతా ఓ పార్టీ సెటప్​లాగా ఉంది. బ్లాక్​ ఔట్​ఫిట్​లో శ్రీలీల క్యూట్​ అండ్ హాట్​గా కనిపిస్తుంది. అయితే ఈ ఫొటో ఎలా లీక్ అయ్యిందో తెలియదు. కానీ, నిమిషాల్లోనే ఈ ఫొటో ఇంటర్నెట్​ను షేక్ చేసేసింది. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్​గా మారింది.

మరోవైపు బన్నీ ఫ్యాన్స్​ మాత్రం దీనిపై రెండు విధాలుగా స్పందిస్తున్నారు. 'డ్యాన్స్ మినిమమ్ అదిరిపోద్ది', 'ఊ అంటావా రికార్డులు బ్రేక్ అవ్వడం పక్కా' అని అంటున్నాకు. 'ఇలా ఫొటోలు లీక్ చేసి స్పాయిల్ చేయకండి', 'లీక్స్​ చేయండం ఎందుకు' అని మరికొందకరు కామెంట్ చేస్తున్నారు.

రికార్డు బ్రేక్
పుష్ప ఓవర్సీస్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. దీంతో ప్రీ బుకింగ్స్​లో పుష్పదే ఫుల్ డామినేషన్​గా కనిపిస్తోంది. గంటల్లోనే వేల టికెట్లు అమ్ముడవుతున్నాయి. యూఎస్ఏ ప్రీమియర్స్​లో 20వేల టికెట్లు సోల్డ్ అయ్యాయి. ఈ క్రమంలో తక్కువ సమయంలో ఈ మార్క్ అందుకున్న ఇండియన్ సినిమాగా పుష్ప రికార్డు కొట్టింది.

ట్రైలర్ అప్డేట్
త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్​ రీసెంట్​గా ప్రకటించారు. కానీ, ఎప్పుడు అనేది తేదీ అనౌన్స్ చేయలేదు. అయితే మరో వారం రోజుల్లోనే ట్రైలర్ రావొచ్చని ఇండస్ట్రీ వర్గాల టాక్. అలాగే ట్రైలర్​ కూడా 3.00 నుంచి 3.30 నిమిషాల నిడివి ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది.

కాగా, డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్​గా నటిస్తుండగా, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్​స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు చాట్ బస్టర్ అయ్యాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్​వైడ్ గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

పుష్ప 2కి ఒక్కరు కాదు ముగ్గురు- పెరుగుతున్న లిస్ట్​!

'పుష్ప 2'లో శ్రీలీల! - ఆ స్పెషల్​ సాంగ్ కోసమేనా?

ABOUT THE AUTHOR

...view details