తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పుష్ప 2'లో శ్రీలీల! - ఆ స్పెషల్​ సాంగ్ కోసమేనా? - SREELEELA PUSHPA 2

త్రిప్తి, శ్రద్ధా కాదు - 'పుష్ప 2'లో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల!

Sreeleela Pushpa 2
Pushpa 2 Sreeleela (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2024, 11:19 AM IST

Sreeleela Pushpa 2 :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్​ రోల్​లో, డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న మూవీ 'పుష్ప 2'. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, స్పెషల్ పోస్టర్స్​ ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పగా,​ రిలీజ్​కు మరికొద్ది నెలలే టైమ్ ఉండటం వల్ల అభిమానుల ఆసక్తి కూడా ఇంతకింత పెరిగిపోతోంది. దీంతో ఈ సినిమా గురించి రోజూకో రూమర్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వార్త మాత్రం 'పుష్ప' పై మరింత క్రియేట్ అయ్యేలా చేస్తోంది.

అదేంటంటే, ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల కేమియో చేయనున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఓ స్పెషల్ సాంగ్​లో. తాజాగా ఈమెను మూవీ టీమ్ సంప్రదించగా, దానికి ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం కాస్త నెట్టింట వైరల్ అవ్వగా, బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'బన్నీ శ్రీలీల కలిసి డ్యాన్స్​ చేస్తే వేరే లెవెల్'​ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే గతంలో ఈ సాంగ్ కోసం 'యానిమల్' బ్యూటీ త్రిప్తి డిమ్రిని అప్రోచ్ అవ్వగా, ఆమె ఆ ఆఫర్​ను రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత శ్రద్ధా కపూర్‌ కూడా కొన్ని కారణాల వల్ల నో చెప్పారట. దీంతో ఈ ఆఫర్ ఇప్పుడు శ్రీలీలను వరించినట్లు తెలుస్తోంది.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సూపర్ సకెస్స్ సాధించింది. ఇప్పుడీ ఈ చిత్రానికి సీక్వెల్​గానే 'పుష్ప 2' రానుంది. ఓ సాధారణ కూలీగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన పుష్పరాజ్‌, ఎర్రచందనం సిండికేట్‌ను శాసించే స్థాయికి ఎలా వెళ్లాడనే ఆసక్తికర అంశాలతో తొలి పార్ట్ ఆకట్టుకోగా, ఆ తర్వాత అతడికి ఎదురైన ఇబ్బందుల గురించి అలాగే వాటిని అతడు ఎదుర్కొన్న తీరు గురించి ఈ 'పుష్ప ది రూల్‌' చూడొచ్చని మేకర్స్ గతంలో వెల్లడించారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్​తో పాటు రష్మిక మంధన్నా, ఫహాద్ ఫాజిల్, లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

మొన్న 'పుష్ప 2'- ఇప్పుడు 'గేమ్​ఛేంజర్'​ - రికార్డ్​ ధరకు హిందీ రైట్స్​!

'పుష్ప పార్ట్ 3' కన్ఫార్మ్ - ప్రొడ్యూసర్​ సెన్సేషనల్ అనౌన్స్​మెంట్

ABOUT THE AUTHOR

...view details