South Industry VS Bollywood Allu arjun :సాధారణంగా సినీ రంగంలో ఒక ఇండస్ట్రీకి మరొక ఇండస్ట్రీకి పోటీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. నెట్టింట్లో అయితే ఈ పోటీకి సంబంధించిన టాపిక్ ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే కొనసాగుతుంటుంది. అలా సౌత్ ఇండస్ట్రీ వర్సెస్ బాలీవుడ్ అంటూ చాలా కాలంగా వార్ జరుగుతోంది. ఎందుకంటే గత కొద్ది కాలంగా టాలీవుడ్ తన స్థాయిని పెంచుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అదే సమయంలో బాలీవుడ్ సక్సెస్ రేట్ లేక డీలా పడుతూ వస్తోంది. ఒకటి రెండు సినిమాలు మినహా బాక్సాఫీస్ ముందు అన్నీ ఫ్లాప్లే వస్తున్నాయి. దీంతో ఈ సౌత్ ఇండస్ట్రీ వర్సెస్ బాలీవుడ్ టాపిక్‌పై సినీ ప్రముఖులు వరుసగా స్పందిస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా దీనిపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఆరు దశాబ్ధాల పాటు హిందీ పరిశ్రమ మంచి సినిమాలతో ఆడియెన్స్‌ను అలరించింది. ప్రస్తుతం అక్కడ సక్సెస్ రేట్ తగ్గిందని పరిశ్రమను విమర్శించడం సరైన విషయం కాదు. సౌత్ ఇండస్ట్రీ, నార్త్ ఇండస్ట్రీ అన్న తేడా లేదు. రెండు కూడా సోదర భావంతో గౌరవించుకుంటున్నాయి. దక్షిణాది చిత్రాల ప్రభావం హిందీపై ఉన్నట్లు అక్కడి చిత్రాల ప్రభావం కూడా ఇక్కడ ఉంటుంది అని ఐకాన్ స్టార్ అన్నారు.