ETV Bharat / state

పద్మ పుర‌స్కారాల్లో తెలంగాణ‌కు అవ‌మానం జ‌రిగింది : సీఎం రేవంత్‌రెడ్డి - PADMA AWARDS 2025

తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి ప్రశంసలు - ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా రాష్ట్రంలోని పలువురి అభినందనలు - పురస్కారాలపై సీఎం అసంతృప్తి

Padma Awards 2025
CM Revanth Reddy On Padma Awards 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2025, 7:34 AM IST

CM Revanth Reddy On Padma Awards 2025 : తెలుగు రాష్ట్రాల నుంచి పద్మా అవార్డులకు ఎంపికైన వారికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో అంకిత భావంతో పని చేసిన వారికి గుర్తింపు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వారి స్ఫూర్తి భవిష్య తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు.

నంద‌మూరి బాల‌కృష్ణకు ప‌ద్మ భూష‌ణ్‌ : భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలు - 2025 జాబితాను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో వైద్య రంగానికి సంబంధించి పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. సినిమా రంగంలో త‌న‌దైన ముద్ర వేసిన నంద‌మూరి బాల‌కృష్ణకు ప‌ద్మ భూష‌ణ్‌, ప్రజా వ్యవ‌హారాల విభాగంలో మంద కృష్ణ మాదిగ‌, క‌ళలు, సాహిత్యం, విద్యా విభాగాల్లో కే.ఎల్.కృష్ణ‌, మాడుగుల నాగ‌ఫ‌ణిశ‌ర్మ, దివంగ‌త మిర్యాల అప్పారావు, రాఘ‌వేంద్రాచార్య పంచ‌ముఖిల‌కు ప‌ద్మశ్రీ పుర‌స్కారాలు ద‌క్కడంపై ముఖ్యమంత్రి హ‌ర్షం వ్యక్తం చేశారు. తాము ఎంచుకున్న రంగంలో చేసిన కృషి అంకిత‌భావమే వారిని దేశంలోని ఉన్నత పుర‌స్కారాల‌కు ఎంపిక‌య్యేందుకు కార‌ణ‌మ‌య్యాయ‌ని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నాగేశ్వర్‌ రెడ్డి స్ఫూర్తి భవిష్య తరాలకు ఆదర్శనీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎక్స్‌ వేదికగా కొనియాడారు.

కిషన్ రెడ్డి అభినందనలు : తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారందరికీ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఆయా రంగాల్లో ప్రత్యేకత గుర్తింపును సంపాదించుకున్న వారి సేవలకు కేంద్ర ప్రభుత్వం సరైన గుర్తింపుతో గౌరవించిందన్నారు. పద్మ అవార్డులకు ఎంపికైన వారిని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. ప‌ద్మ విభూష‌ణ్, ప‌ద్మ భూష‌ణ్‌, ప‌ద్మ శ్రీ పుర‌స్కారాల‌కు ఎంపికైన వారికి ఆయన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ప‌ద్మ పుర‌స్కారాల్లో రాష్ట్రానికి అన్యాయం : పద్మ పుర‌స్కారాల్లో తెలంగాణ‌కు అవ‌మానం జ‌రిగింద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గ‌ద్దర్, చుక్కా రామ‌య్య, అందెశ్రీ, గోర‌టి వెంక‌న్న, జ‌య‌ధీర్ తిరుమ‌ల‌రావు వంటి ప్రముఖుల‌ను కేంద్ర ప్రభుత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోక‌పోవ‌డం తెలంగాణ ప్రజ‌ల‌ను అవ‌మానించ‌డ‌మేన‌ని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారుల‌తో జ‌రిగిన స‌మావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చ‌ర్చించారు.

ప‌ద్మ పుర‌స్కారాల్లో రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయంపై ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి లేఖ రాయాల‌నే యోచ‌న‌లో సీఎం ఉన్నారు. తెలంగాణ స‌మాజానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవ‌లు అందించిన వారిని గుర్తించ‌క‌పోవ‌డం రాష్ట్ర ప్రజ‌ల ఆత్మగౌర‌వానికి భంగం క‌లిగించడ‌మేన‌ని సీఎం పేర్కొన్నారు. 139 మందికి పుర‌స్కారాలు ప్రక‌టించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి క‌నీసం ఐదు పుర‌స్కారాలు ప్రకటించ‌క‌పోవ‌డంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్‌, బాలకృష్ణకు పద్మభూషణ్, మందకృష్ణకు పద్మశ్రీ

బాలకృష్ణకు అరుదైన గౌరవం- పద్మభూషణ్‌ అవార్డుకు ఎంపికైన నటసింహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.