తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నా పిల్లలకు వాళ్ల గురించి చెబుతాను : శోభిత ధూళిపాళ్ల - SobhitaDhulipala About Her Children - SOBHITADHULIPALA ABOUT HER CHILDREN

Sobhita Dhulipala About Her Children : తనకు పుట్టబోయే పిల్లలకు వాళ్ల గురించి చెబుతానని చెప్పింది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. ఇంతకీ వారెవరంటే?

Sobhita Dhulipala
Sobhita Dhulipala (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2024, 9:17 AM IST

Sobhita Dhulipala About Her Children :గూఢచారి, మేడ్ ఇన్ హెవెన్, ఘోస్ట్ స్టోరీస్, నైట్ మేనేజర్, పోన్నియన్ సెల్వన్ వంటి సినిమా/సిరీస్​లో ప్రధాన పాత్రలు చేసిన శోభిత ధూళిపాళ్ల ప్రస్తుతం ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా చైతూతో ఎంగేజ్​మెంట్ జరిగాక మరింత హాట్​ టాపిక్​గా మారింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ పెట్టిన పోస్ట్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

శోభిత ధూళిపాళ్ల మ‌ణిరత్నం దర్శకత్వంలో నటించిన చిత్రం 'పొన్నియిన్ సెల్వన్‌-1'. ఈ భారీ చిత్రం రిలీజై రెండేళ్లు పూర్తైన సందర్భంగా నటి శోభిత ధూళిపాళ్ల ఆ సినిమా షూటింగ్​ రోజులను గుర్తు చేసుకుంది. ఆ మూవీటీమ్​తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోకు ఆమె పెట్టిన క్యాప్షన్‌ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది.

ఈ చిత్రంలో విలక్షణ నటుడు, హీరో విక్రమ్​తో పాటు జయం రవి, కార్తి, ఐశ్వర్యారాయ్. త్రిష, శోభితా ధూళిపాళ్ల నటించారు. వీళ్లందరితో కలిసి దిగిన ఫొటోను శోభిత పోస్ట్ చేసింది. 'వీరందరు ఎవెంజర్స్‌, నా పిల్లలకు వీళ్ల గురించి చెప్తాను' అని పోస్ట్​ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్​గా మారింది.

కాగా, తమిళనాడులో అత్యంత పాఠ‌కాద‌ర‌ణ పొందిన న‌వ‌లలో పొన్నియిన్ సెల్వన్‌ కూడా ఒకటి. క‌ల్కి కృష్ణమూర్తి ఈ న‌వ‌లను రచించారు. దీని ఆధారంగానే దర్శకుడు మణిరత్నం సినిమాను తెరకెక్కించారు. రెండో భాగాలుగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకుంది. తాజాగా జరిగిన ఐఫాలోనూ పురస్కారాలను దక్కించుకుంది. ఉత్తమ నటుడిగా విక్రమ్‌ అవార్డును అందుకున్నారు. క్రిటిక్స్‌ ఛాయిస్‌లో ఉత్తమ నటిగా ఐశ్వర్యారాయ్‌ నిలిచింది.

Sobhita Dhulipala Love Sitara Movie OTT :ఇకపోతే శోభిత ధూళిపాళ్ల నటించిన లవ్‌, సితార ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ జీ 5లో అందుబాటులో ఉంది. హాస్యం, భావోద్వేగం ప్రధానంగా సినిమా రూపొందింది. వందన కటారియా దర్శకత్వం వహించారు.

OTTలోకి శోభిత ధూళిపాళ్ల లవ్, హార్ట్​ బ్రేక్​ స్టోరీ! - ఆ రోజు నుంచే స్ట్రీమింగ్​ - Sobhita Dhulipala Love Sitara OTT

ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్‌ - ఏమైందంటే? - Rajnikanth Hospitalized

ABOUT THE AUTHOR

...view details